Advertisement
ఆర్ఆర్ఆర్.. ప్రీబుకింగ్ లో స‌రికొత్త రికార్డులు
Bollywood Latest Movies Regional Tollywood

ఆర్ఆర్ఆర్.. ప్రీబుకింగ్ లో స‌రికొత్త రికార్డులు

Advertisement

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా సంచ‌ల‌న చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన ఆర్ఆర్ఆర్ కోసం దేశంలో ఉన్న సినీ అభిమానులు అంద‌రూ ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న ఆర్ఆర్ఆర్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.
దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ భారీ చిత్రాన్ని డివివి ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ పరంగా భారీ హైప్ నెలకొంది. ఎప్పుడెప్పుడు బుకింగ్ ఓపెన్ చేస్తారా..? టిక్కెట్ బుక్ చేద్దామా అని ఎదురు చూసారు. ఎట్ట‌కేల‌కు ఓవ‌ర్ సీస్ లో ప్రీమియ‌ర్ బుకింగ్స్ ఓపెన్ చేయ‌డంతో ప్రీ సేల్స్ 175K డాలర్లు వద్ద జరిగాయి. ఈ చిత్రం కేవలం కొన్ని గంటల్లోనే 175K డాలర్లను వసూలు చేసింది. రోజులు గడిచేకొద్దీ ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. మరే ఇతర తెలుగు సినిమా ఇలాంటి రికార్డును సాధించలేదు.

ఇక అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికి వస్తే.. ఆర్ఆర్ఆర్ ఇప్పుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ విధంగా ఆర్ఆర్ఆర్ రిలీజ్ కాకుండానే ప్రీ బుకింగ్ లో స‌రికొత్త రికార్డులు సృష్టిస్తుంది. ఇక రిలీజ్ అయితే.. ఫ‌స్ట్ డే ఎంత క‌లెక్ట్ చేస్తుందో.. ఫుల్ ర‌న్ లో ఎంత క‌లెక్ట్ చేస్తుందో..? బాహుబ‌లి రికార్డ్ ను ఆర్ఆర్ఆర్ క‌లెక్ట్ చేస్తుందో లేదో చూడాలి.

Advertisement