Advertisement
డిసెంబర్ 9న థియేటర్లలోకి ఆర్ఆర్ఆర్…
Bollywood Latest Movies Regional Tollywood

డిసెంబర్ 9న థియేటర్లలోకి ఆర్ఆర్ఆర్…

Advertisement

అనివార్య కారణాలతో వాయిదా పడిన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ నెల 9న సిల్వర్ స్క్రీన్ వండర్ ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. ఆ రోజు యూట్యూబ్ లోనే కాకుండా థియేటర్లలోనూ ట్రైలర్ స్క్రీనింగ్ చేస్తున్నారు. వందలాది థియేటర్లలో ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ఆడియెన్స్ కు ఐ ఫీస్ట్ చేయనుంది. ఈ నెల 3నే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కావాల్సింది. లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూతతో ట్రైలర్ రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు. ఇటీవలే విడుదల చేసిన జనని సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

450 కోట్ల్ రూపాయల భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మాణంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్ ను రూపొందించారు. ఆలియా భట్, అజయ్ దేవగణ్, ఒలీవియా మోరిస్ వంటి జాతీయ, అంతర్జాతీయ నటీనటులు ఆర్ఆర్ఆర్ కీలక పాత్రలు పోషించారు. ప్రచార కార్యక్రమాలు ఇటీవలే మొదలుపెట్టిన ఈ సినిమా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.

Advertisement