Advertisement
“ఆర్ఆర్ఆర్”.. రెమ్యూన‌రేష‌న్స్ ఎంతో తెలుసా..?
Latest Movies Tollywood Trending News

“ఆర్ఆర్ఆర్”.. రెమ్యూన‌రేష‌న్స్ ఎంతో తెలుసా..?

Advertisement

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన ఆర్ఆర్ఆర్ ప్ర‌పంచ వ్యాప్తంగా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. రిలీజ్ కి ముందే ప్రీమియ‌ర్ షోస్ బుకింగ్ లో రికార్డులు సాధిస్తూ.. స‌రికొత్త రికార్డుల దిశ‌గా దూసుకెళుతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం రాజమౌళితో పాటుగా ఎన్టీఆర్, రామ్ చరణ్ మరియు ఇతర సాంకేతిక నిపుణులు నాలుగేళ్లుగా కష్టపడుతున్నారు.

అయితే.. ఆర్ఆర్ఆర్ సినిమాకి గాను వీళ్ల‌కు రెమ్యున‌రేష‌న్ ఎంత‌ అనేది ఆస‌క్తిగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వార్తల ప్రకారం.. ఇంత సమయం కేటాయించి తీవ్రంగా శ్రమించిన వీరందరికీ తగిన పారితోషికమే అందిన‌ట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇంత‌కీ ఎవ‌రెవ‌రికి ఎంతంత అంటే.. పాన్ ఇండియా స్థాయిలో రూపొందే ఈ మల్టీస్టారర్ చేసినందుకు తారక్ మరియు చరణ్ ఒక్కొక్కరికి 45 కోట్ల వరకు చెల్లించారట.

అలానే ఇందులో తక్కువ నిడివి గల పాత్ర పోషించినప్పటికీ.. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ కు 25 కోట్లు ఇచ్చారట. రాజమౌళి సినిమాలో చిన్న పాత్ర అయినా చేయాలని ఆశపడిన ఆలియా భట్.. ఈ మూవీ కోసం 9 కోట్ల వరకు తీసుకున్నారట.

స్టార్ డమ్ తో పాటుగా నార్త్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని అజయ్, అలియాలకు ఈ స్థాయి రెమ్యూనరేషన్స్ ఇచ్చారని అంటున్నారు. ఇక ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళికి అండ్ ఫ్యామిలీకి ఆర్ఆర్ఆర్ లాభాల్లో 30 శాతం వరకు వాటా అందనుందని ప్రచారం జరుగుతోంది. అయితే.. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త వాస్త‌వ‌మేనా..? కాదా..? అనేది తెలియాల్సివుంది.

Advertisement