Advertisement
“ఆర్ఆర్ఆర్”.. ట్రైల‌ర్ లో ఇవి గ‌మ‌నించారా..?
Bollywood Latest Movies Tollywood

“ఆర్ఆర్ఆర్”.. ట్రైల‌ర్ లో ఇవి గ‌మ‌నించారా..?

Advertisement

బాహుబ‌లి త‌ర్వాత‌ దర్శకధీరుడు రాజమౌళి అత్యంత‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన‌ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ఆర్ఆర్ఆర్. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న ఆర్ఆర్ఆర్ ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా ఈ రోజు ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైల‌ర్ గురించి చిన్న పెద్దా అనే తేడా లేదు.. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేదు.. అంద‌రి నోట ఒక‌టే మాట‌.. ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్ అద్భుతం అంటూ జ‌క్క‌న్న పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

అయితే.. ట్రైల‌ర్ లో అంద‌రూ అన్నీ గ‌మ‌నించ‌క‌పోవ‌చ్చు కానీ.. చాలా వ‌ర‌కు సినిమా ఎలా ఉండ‌బోతుందో క్లారిటీ ఇచ్చేశాడు జ‌క్క‌న్న‌. ట్రైల‌ర్ లో ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం.. గోండు ప్రజల కాపరిగా.. కొమ‌రాం భీమ్ గా ఎన్టీఆర్ క‌నిపించ‌నున్నారు అనే విష‌యం చెప్ప‌డం జ‌రిగింది. అలాగే గొండు ప్ర‌జ‌ల‌కు ఏ క‌ష్టం వ‌చ్చినా నేనున్నాను అంటూ కొమ‌రం భీమ్ ముందుంటారు. ఆఖ‌రికి వాళ్ల కోసం పులితో సైతం ఫైట్ చేయ‌డానికి వెన‌కాడ‌డు అని విష‌యం క్లియ‌ర్ గా చెప్ప‌డం జ‌రిగింది.

ఆ బెబ్బులిని పట్టుకునే వేటగాడిగా.. బ్రిటీష్ వారి ఆధీనంలో పని చేసే పోలీస్ రామరాజుగా రామ్ చరణ్ ని పరిచయం చేసారు.
చిన్నారిని రక్షించడానికి భీమ్ వేషం మార్చి రామరాజుతో స్నేహం చేయ‌డం… ఈ క్రమంలో రామరాజు, కొమ‌రం భీమ్ ల మధ్య స్నేహం ఏర్ప‌డ‌డం.. ఆత‌ర్వాత వైరంగా మార‌డం ఈ ట్రైలర్ లో చూపించారు. బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగినందుకు భీమ్ ను రామరాజు అరెస్ట్ చేయడం.. భీమ్ ను రామరాజు కొట్టడం.. సీత పాత్రలో నటించిన అలియా భట్ ను పోలీసులు కాలితో తన్నడం.. భీమ్ చేతిలో రామరాజు దెబ్బలు తినడం వంటి సన్నివేశాలు చూపించారు.

ఆఖ‌రికి తార‌క్, చ‌ర‌ణ్ ఇద్ద‌రూ కలిసి బ్రిటీష్ వారి మీద యుద్ధం చేసినట్లు అర్థం అవుతుంది. అల్లూరి గెటప్ లో విల్లు చేతబట్టి నిప్పుల్లోంచి చరణ్ బాణాలు విసరడం.. పులికి ఎదురొడ్డి తారక్ గర్జించడం వంటి సీన్స్ చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే. అలానే బైక్ ని తన్ని ఎన్టీఆర్ చేత్తో దాన్ని హ్యండిల్ చేయడం.. చరణ్ గుర్రం మీద దూసుకురావడం అదిరింది. చివరల్లో తారక్, చర‌ణ్‌ కలిసి టవర్ పైకి ఎక్కే యాక్షన్ సీన్ అయితే.. ఈ ట్రైలర్ కే హైలెట్ గా చెప్పొచ్చు. అన్ స్టాప‌బుల్ అన్న‌ట్టుగా ట్రైల‌ర్ దూసుకెళుతుంది. మ‌రి.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఆర్ఆర్ఆర్ క‌లెక్ష‌న్స్ తో రికార్డుల మోత మ్రోగించ‌డం ఖాయం.

Advertisement