Advertisement
ఆర్ఆర్ఆర్ 40 నిమిషాల క్లైమాక్స్.. ఎంత ఖ‌ర్చుపెట్టారో తెలుసా..?
Bollywood Latest Movies Tollywood

ఆర్ఆర్ఆర్ 40 నిమిషాల క్లైమాక్స్.. ఎంత ఖ‌ర్చుపెట్టారో తెలుసా..?

Advertisement

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళిల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ఆర్ఆర్. భారీ చిత్రాల నిర్మాత డివివి దాన‌య్య దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్ తో ఈ సినిమాను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. జ‌న‌వ‌రి 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సిన ఆర్ఆర్ఆర్ వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల ఈ చిత్రం న్యూ రిలీజ్ డేట్స్ అంటూ మార్చి 18, ఏప్రిల్ 28 అంటూ రెండు డేట్స్ అనౌన్స్ చేశారు. దీంతో ఈ రెండు డేట్స్ లో ఆర్ఆర్ఆర్ విడుద‌ల అయ్యేది ఎప్పుడ‌ని సినీ అభిమానులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే… ఈ సినిమా గురించి ఇప్పుడు ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే… ఇందులో క్లైమాక్స్ దాదాపు 40 నిమిషాలు ఉంటుంద‌ట‌. ఈ 40 నిమిషాల క్లైమాక్స్ కోసం దాదాపు 80 నుంచి 90 కోట్లు ఖర్చు చేశారని స‌మాచారం. ఈ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్ష‌కుల‌కు థ్రిల్ క‌లిగిస్తుంద‌ని… కనీవినీ ఎరుగ‌ని రీతిలో ఈ యాక్ష‌న్ ఎపిసోడ్స్ ఉంటాయ‌ని తెలిసింది. స‌హ‌జంగా సినిమా రిలీజ్ వాయిదా ప‌డితే ఆ సినిమా మీద ఆడియ‌న్స్ లో ఇంట్ర‌స్ట్ అనేది త‌గ్గుతుంటుంది కానీ.. ఆర్ఆర్ఆర్ ఇన్ని సార్లు వాయిదాప‌డినా రోజురోజుకు అంచ‌నాలు పెరుగుతూనే ఉన్నాయి.

ఇక రిలీజ్ విష‌యానికి వ‌స్తే… మార్చి 18న విడుద‌ల చేయాలి అనుకున్న‌ప్ప‌టికీ… ఈ డేట్ కి ఆర్ఆర్ఆర్ వ‌చ్చే అవ‌కాశాలు చాలా అంటే చాలా త‌క్కువ అని చెప్ప‌చ్చు. ఎందుకంటే… ఇప్పుడిప్పుడే నార్త్ లో క‌రోనా కేసులు త‌గ్గ‌డం స్టార్ట్ అయ్యాయి. సౌత్ లో మాత్రం ఇంకా కేసులు పెరుగుతున్నాయి. అందుచేత దేశ‌మంతా క‌రోనా కేసులు త‌గ్గిన త‌ర్వాత రిలీజ్ అంటే… టైమ్ ప‌డుతుంది. కాబ‌ట్టి ఏప్రిల్ 28నే ఆర్ఆర్ఆర్ విడుద‌ల అని గ‌ట్టిగా వినిపిస్తోంది.

Advertisement