డైలాగ్ కింగ్ సాయికుమార్ కుమారుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఆది సాయికుమార్ … తెలుగు ఇండస్ట్రీలో ప్రామిసింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఈ యువ హీరో నటించిన టాప్ గేర్ ఆడియన్స్ లో మంచి బజ్ ను సొంతం చేసుకుంది. థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం… టీజర్, ట్రైలర్లతో ఆకట్టుకుంది. ఆది సాయికుమార్ సరసన రియా సుమన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని కె.వి.శ్రీధర్ రెడ్డి నిర్మించగా… శశికాంత్ దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఆడియన్స్ ని ఎలా థ్రిల్ కు గురి చేసిందో చూద్దాం పదండి.
కథ: సిద్ధార్థ్(మైమ్ గోపి) ఓ పెద్ద డ్రగ్ డీలర్ కాగా ఈ క్రమంలో తాను సింగపూర్ కి పారిపోవాలని ప్లాన్ చేసుకుంటాడు. మరి ఈ ప్లానింగ్ లో డీల్ నిమిత్తం హైదరాబాద్ కి వస్తాడు. ఇక మరోపక్క అర్జున్(ఆది సాయికుమార్) అప్పుడే పెళ్లి చేసుకొని ఓ క్యాబ్ డ్రైవర్ గా లైఫ్ లీడ్ చేస్తాడు. అయితే అనూహ్యంగా తాను ఈ డ్రగ్ రాకెట్ లో చిక్కుకోగా నెక్స్ట్ తన భార్య ఆధ్య(రియా సుమన్) ని కాపాడుకోవడం కోసం ఆ క్రిమినల్స్ చెప్పినట్టు చెయ్యాల్సి వస్తుంది. మరి ఈ రాకెట్ నుంచి తాను ఎలా బయటకి వస్తాడు? తన భార్యని కాపాడుకోగలుగుతాడా? ఆ ముఠాని పట్టిస్తాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమాని వెండితెరపై చూడాల్సిందే.


ఆది సాయికుమార్ ప్రతి సినిమాకి వేరియషన్ చూపెడుతూ… తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. యువ హీరోల్లో ఏ పాత్రనైనా అవలీలగా చేసేస్తూ… తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. సినిమా సినిమాకి బాగా డెవలప్ అవుతూ వస్తున్నాడు. ఇందులో ఓ క్యాబ్ డ్రైవర్ గా… ఓ భర్తగా మంచి ఎమోషన్స్ ని పండించాడు. తన లుక్స్ పరంగా కూడా డీసెంట్ గా కనిపించాడు. అలాగే నటి రియా సుమన్ కూడా గుర్తింపు వుండే పాత్రలో నటించింది. ఇక వీరితో పాటు సినిమాలో సత్యం రాజేష్, బ్రహ్మాజీ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇందులో ట్విస్టులు బాగా వున్నాయి. సినిమా ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా సాగుతూ… ఆడియన్స్ ని బాగా ఎంగేజ్ చేసే విధంగా… ఆర్టిస్టుల పర్ ఫార్మెన్స్ ఉంది.


దర్శకుడు శశికాంత్ రాసుకున్న కథ… కథనాలు బాగున్నాయి. సినిమాని చాలా డీసెంట్ గా తెరీమద ఆవిష్కరించారు. ఆడియన్స్ ని ఆకట్టుకోవడానికి మైండ్ గేమ్ సీన్స్ ని చాలా ఆసక్తికరంగా మలిచారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. హర్ష వర్ధన్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాలో డీసెంట్ గా ఉంది. అలాగే తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. అలాగే సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. అలాగే డైలాగ్స్, ఎడిటింగ్ బాగున్నాయి.
రేటింగ్: 2.5/5