తోడేలు మూవీ రివ్యూ

హిందీలో భేడియా పేరుతో రూపొందిన చిత్రాన్ని తెలుగులో తోడేలుగా డబ్ చేసి విడుదల చేశాడు సీనియర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. అంతకు ముందే కాంతార మూవీ డబ్బింగ్ ఓ బ్లాక్ బస్టర్ అందుకున్న అరవింద్ ఈ మూవీతోనూ ఆ మ్యాజిక్ ను రిపీట్ చేస్తాడు అనుకున్నారు. అందుకు తగ్గట్టుగా ఫర్వాలేదనిపించేలా ప్రమోషన్స్ చేసి వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ లోనే విడుదల చేశారు. థియేటర్స్ ఉన్నాయి కాబట్టి నంబరింగ్ ఓకే.. మర కంటెంట్ ఎలా ఉందీ అంటే ఈ బ్రీఫ్ రివ్యూలో చూద్దాం.
కథ :
భాస్కర్(వరుణ్‌ ధావన్) ఓ పెద్ద కన్ స్ట్రక్షన్ కంపెనీకి రోడ్ అప్రూవల్ చేయిస్తానని డబ్బులు తీసుకుని హామీగా తన తాత ఇల్లు కూడా రాసి ఇస్తాడు. అతను రోడ్ వేయించాల్సింది.. అరుణాచల్ ప్రదేశ్ లోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న జిరో అనే ఏరియాలో. తన ఫ్రెండ్ జనార్ధన్( అభిషేక్ బెనర్జీ)తో కలిసి అరుణాచల్ వెళతాడు. అక్కడ వారికి మరో స్నేహితుడు గైడ్ గా ఉంటాడు. అంతా కలిసి ఆ అడవి మధ్య నుంచి రోడ్ వేసేలా స్థానిక అధికారులకు లంచం ఇచ్చి ఒప్పిస్తారు. అందుకు గిరిజనులు ఒప్పుకోరు. వారిని ఒప్పించే క్రమంలో ఓ రోజు మద్యం తాగి అడవి గుండూ వెళుతుండగా.. కార్ చెడిపోతుంది. అప్పుడే భాస్కర్ ను ఓ తోడేలు తరుముతుంది. తప్పించుకునే క్రమంలో ఉండగానే అది అతన్ని కరుస్తుంది. తర్వాత ఆ విషయం చెబితే అదో వైరస్ లా భావించి ఊరి నుంచి తరిమేస్తారని.. లోకల్ గా ఉండే పశువుల డాక్టర్ అనిక(కృతి సనన్) వద్దకు వెళతాడు. తనో ఇంజెక్షన్ వేస్తే అది వికటిస్తుంది. దీంతో భాస్కర్ పగలు మంచిగా ఉన్నా.. రాత్రుళ్లు తోడేలులా మారి కొందరిని చంపుతుంటాడు. మరి ఆ తోడేలు ఇతన్ని ఎందుకు కరిచింది.. అతను ఎవరిని చంపాడు.. తోడేలు నుంచి మళ్లీ మనిషిగా మారాడా లేదా అనే