తగ్గేదేలే మూవీ రివ్యూ

రివ్యూ :- తగ్గేదేలే
తారాగణం :- నవీన్ చంద్ర, దివ్య పిళ్లై, అనన్య సేన్ గుప్త, రవిశంకర్, రాజా రవీంద్ర, నాగబాబు తదితరులు ..
సంగీతం :- చరణ్‌ అర్జున్
ప్రొడ్యూసర్ :- ప్రేమకుమార్ పాండే, పవి సుబ్బారెడ్డి
దర్శకత్వం :- శ్రీనివాస్ రాజు

కథ :-

తగ్గేదేలే చిత్రాన్ని కథలా చూస్తే.. ఈశ్వర్(నవీన్ చంద్ర) ఓ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్. ఓ ప్రైవేట్ పార్టీలో లిజీ అనే అమ్మాయితో కలిసి రెండు రోజులు గడుపుతాడు. తర్వాత అతనికి పెళ్లవుతుంది. పెళ్లి తర్వాత లిజీ మళ్లీ అతని లైఫ్ లోకి వచ్చి ఇబ్బంది పెడుతుంది. ఆ క్రమంలో ఓ రోజు తను మర్డర్ అవుతుంది. ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఈశ్వర్ ను పోలీస్ లు ఓ ధాబా వద్దకు తీసుకువెళ్లి విచారిస్తుంటారు. ఈ క్రమంలో దండుపాళ్యం బ్యాచ్ జైలు నుంచి కోర్ట్ కు వెళ్లే దారిలో తప్పించుకుని ఇన్వెస్టిగేషన్ ఆఫసర్ ను చంపేందుకు వస్తారు. తర్వాతేమైందీ అంటే ఎవరైనా సులువుగానే ఊహించొచ్చు.సినిమా పోస్టర్స్ కూడా మోసం చేస్తాయి.. అనే మాట ఎప్పుడో కానీ వినం. పోస్టర్ లో కనిపించేది ఒకటి సినిమాలో ఉండేది మరోటి అన్న సందర్భాలు అత్యంత అరుదు. అలాంటి అరుదైన “కళాఖండమే” ఈ తగ్గేదేలే. అసలు ఇలాంటి చిత్రాలకు రివ్యూస్ రాయడం కూడా దండగే అనిపిస్తుంది.కానీ చూసే ప్రేక్షకులను కొందరినైనా కాపాడినట్టు అవుతుంది కదా అని రాయడమే. లేదంటే ఎప్పుడో ముగిసిపోయిన దండుపాళ్యంకు “క్లైమాక్స్” కోసం ఈ సినిమా తీస్తాడా దర్శకుడు. ఎంత దండుపాళ్యం తనకు ఇష్టమైన సినిమా అయితే మాత్రం దాన్ని జనంపై రుద్దడం మంచి మేకర్ చేసే పని కాదు.