OTT Reviews

“సార్పట్ట” – రివ్యూ

ఆర్య, దుషారా విజయన్‌, పశుపతి, అనుపమ కుమార్‌, సంచన నటరాజన్‌ తదితరులు నటించిన చిత్రం సార్పట్ట. పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని షణ్ముగమ్‌ దక్షణ్‌రాజ్‌ నిర్మించారు. స్పార్ట్స్ డ్రామా కథాంశంతో రూపొందిన ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదల అయ్యింది. ఇంతకీ.. ఈ సినిమా ఎలా ఉంది.? ఓటీటీలో రిలీజైన ఈ సినిమా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందా..? లేదా..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ – మనదేశానికి వచ్చిన ఆంగ్లేయులు వాళ్ల సరదా కోసం భారతీయులకు బాక్సింగ్ నేర్పిస్తారు. అలా బాక్సింగ్ నేర్చుకున్న వాళ్లు తరతరాలకు వారికి నేర్పిస్తారు. అలా బాక్సింగ్ అనేది కొందరి జీవితాల్లో వంశపారంపర్యంగా వస్తుంటుంది. అయితే.. ఇడియప్ప, సార్పట్ట పరంపరలు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ పోటీ పడుతుంటారు. ఉత్తర చెన్నైలోని ఓ హార్బర్‌లో కూలిగా పనిచేస్తుంటాడు సమరన్‌ (ఆర్య). ఒక రోజు అనుకోకుండా బాక్సింగ్ చేసేందుకు రెడీ అవుతాడు. అయితే.. సమరన్‌ బాక్సింగ్‌ పోటీలకు వెళ్లడం తల్లి భాగ్యం (అనుపమ కుమార్‌)కు ఏమాత్రం నచ్చదు. అయితే.. బాక్సర్‌గా సమరా తనను తాను నిరూపించుకునే సమయంలో కథ మొత్తం ఒక్కసారిగా అడ్డం తిరుగుతుంది.

అప్పటినుంచి సమరా చెప్పుడు మాటలు విని తాగుడికి బానిస అవుతాడు. ఎంతలా అంటే.. చివరకు బాక్సింగ్ చేయలేని స్థితికి చేరుకుంటాడు. ఈ నేపధ్యంలో తన తప్పు తెలుసుకున్న సమరా తిరిగి ఎలా బాక్సింగ్ రింగ్‌లోకి అడుగుపెడతాడు..? సమరన్ తల్లికి బాక్సింగ్ అంటే అసలు నచ్చదు. తన కొడుకును బాక్సింగ్ కి వెళ్లద్దు అని చెబుతుంది.? దీనికి కారణం ఏంటి..? సమరన్ బాక్సింగ్ కెరిర్‌కి ముందు, తర్వాత ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయన్నాయి. ? చివరగా సమరన్ తన పోటీదారులను ఎలా ఎదుర్కొ్నాడు.? దీని కోసం ఏం చేశాడు.? అనేదే కథ.

ప్లస్ పాయింట్స్
ఆర్య నటన
ఫస్టాఫ్‌
పా. రంజిత్ దర్శకత్వం

మైనస్ పాయింట్స్
సెకండాఫ్
రన్ టైమ్

విశ్లేషణ – స్పోర్ట్స్ డ్రామాలు ఎప్పుడూ బాగానే ఉంటాయి కారణం ఏంటంటే.. ఆటలో ఎవరు గెలుస్తారు అనేది చివరి వరకు ఉత్కంఠగా ఉంటుంది. ఈ సినిమా కథను కూడా అలాగే ఇంట్రస్టింగ్ గా రాసుకున్నారు. అలాగే ఉత్కంఠగా చూసేలా తెరకెక్కించారు. అయితే… సినిమా ప్రారంభంలో ఉన్న ఆసక్తి సినిమా ముందుకు వెళుతున్న కొద్దీ అక్కడక్కడా తగ్గుతున్నట్టు అనిపిస్తుంటుంది. ప్రధాన తారగణం మధ్య ఎమోషన్ సీన్స్ రిపీట్ అవుతుండడం తగ్గించి, ప్రీ క్లైమాక్స్‌ని ఇంకొంచెం కొత్తగా చూపించి ఉంటే బెటర్‌గా అనిపించేది. 70వ దశకం చివరిలో విధించిన ఎమర్జెన్సీ కాలానికి బాక్సింగ్‌ నేపథ్యాన్ని జోడించి సినిమాను తీర్చిదిద్దాడు దర్శకుడు.

ఇతర విషయాల జోలికి వెళ్లకుండా నేరుగా కథలోకి తీసుకెళ్లిపోయాడు. బాక్సింగ్‌ అంటే ప్రాణం పెట్టే ఓ యువకుడు అనుకోకుండా బాక్సర్‌గా మారడం, ఇరు వర్గాలు చేసే కుట్రల నుంచి తప్పించుకుని పోటీలో దిగడం తదితర సన్నివేశాలతో ఆసక్తిగా తీర్చిదిద్దాడు. ఇంటర్వెల్ కి ముందు వచ్చే బాక్సింగ్‌ ఫైట్‌ చూస్తే సినిమా క్లైమాక్స్‌ ఫైటా? అన్న స్థాయిలో ఉంటుంది. అంతలా అలరించేలా ఆ ఫైట్‌ సీక్వెన్స్‌ తీర్చిదిద్దారు దర్శకుడు పా రంజిత్. సాధారణ యువకుడిగా, బాక్సర్‌గా సమరన్‌ పాత్రలో ఆర్య అదరగొట్టాడు. సమరన్‌ పాత్ర కోసం ఆర్య పడిన కష్టమంతా తెర పై కనిపిస్తుంది. బాక్సర్‌గా ఆయన తీసుకున్న శిక్షణ, బాడీ లాంగ్వేజ్‌ మారిన తీరు మెప్పిస్తుంది.

ప్రథమార్ధంలో ఉన్నంత జోష్‌ ద్వితీయార్ధంలో కూడా ఉండి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది. ఏదేమైనా స్పోర్ట్స్ డ్రామాలను కోరుకునే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుందని చెప్పాలి. ఇక మామూలు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఒకసారి చూడచ్చు.

Post Comment