Advertisement
రివ్యూ – ల‌క్ష్య
Latest Movies Reviews Tollywood

రివ్యూ – ల‌క్ష్య

Advertisement

నాగ‌శౌర్య‌, కేతిక శ‌ర్మ జంట‌గా న‌టించిన చిత్రం ల‌క్ష్య‌. ఈ చిత్రానికి ధీరేంద్ర సంతోష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్ల పై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. డిసెంబర్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ల‌క్ష్య ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందా..? నాగ‌శౌర్య‌కు విజ‌యాన్ని అందించిందా..? లేదా..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

క‌థ

పుట్టుకతోనే విలువిద్యను ఒంట‌బ‌ట్టించుకుంటాడు పార్థు (నాగ‌శౌర్య‌). ఆ విద్య అత‌నికి తండ్రి వాసు (ర‌విప్ర‌కాష్‌) నుంచి వార‌స‌త్వంగా వ‌చ్చింది. వాసు విలువిద్య క్రీడాకారుడే. ఆర్చ‌రీలో వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్ కావాల‌న్న‌దే డ్రీమ్. అయితే.. అనుకోకుండా రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణిస్తాడు. వాసు తండ్రి స‌చిన్ ఖేడ్క‌ర్ త‌న కొడుకు క‌ల‌ను మ‌న‌వ‌డు (నాగ‌శౌర్య‌) ద్వారా నెర‌వేర్చాలి అనుకుంటాడు. పార్థు త‌న ల‌క్ష్య సాధ‌న కోసం ట్రైనింగ్ తీసుకుంటాడు. కురుక్షేత్ర ఆర్చరీ అకాడ‌మీలో చేర‌తాడు. అదే అకాడ‌మీలో రాహుల్ (శ‌త్రు) కూడా విలువిద్యలో శిక్షణ తీసుకుంటుంటాడు.

వ‌రుస‌గా రెండు సార్లు ఆర్చరీలో స్టేట్ ఛాంపియ‌న్‌గా నిలిచిన అత‌నికీ వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌గా నిల‌వాల‌నే కోరిక ఉంటుంది. ఆర్చరీలో త‌న‌ని కొట్టేవాడే లేడ‌ని విర్రవీగే అత‌నికి పార్థు రూపంలో గ‌ట్టి పోటీ ఎదుర‌వుతుంది. స్టేట్ ఆర్చరీ ఛాంపియ‌న్ షిప్‌లో అత‌ని చేతిలో ఓసారి ఓట‌మి పాల‌వుతాడు. దీంతో ఆ ఓట‌మిని జీర్ణించుకోలేక‌పోయిన రాహుల్‌.. ఎలాగైనా పార్థు ల‌క్ష్యాన్ని దెబ్బతీయ‌డానికి ప్రణాళిక ర‌చిస్తాడు. అదే స‌మ‌యంలో పార్థు తాత చ‌నిపోవ‌డంతో మాన‌సికంగా బాగా కుంగిపోతాడు. ఇలాంటి టైమ్ లో పార్థు జీవితంలో ఏం జ‌రిగింది.? రితిక (కేతిక శ‌ర్మ‌) ప్రేమాయ‌ణం ఏమైంది..? చివ‌రి తాత క‌ల‌ను నిజం చేశాడా..? లేదా..? అనేదే మిగిలిన క‌థ‌.

ప్ల‌స్ పాయింట్స్
క‌థా నేప‌థ్యం
నాగ‌శౌర్య‌, జ‌గ‌ప‌తిబాబు న‌ట‌న‌
ఇంట‌ర్వెల్ ఎపిసోడ్
క్లైమాక్స్

మైన‌స్ పాయింట్

క‌థ‌నం
వీక్ ఎమోషన్స్
సంఘ‌ర్ష‌ణలో ప‌ట్టులేక‌పోవ‌డం

విశ్లేష‌ణ

పార్థు పాత్రలో నాగ‌శౌర్య చ‌క్కగా ఒదిగిపోయారు. క్యారెక్ట‌ర్ కి త‌గ్గ‌ట్టుగా లుక్ ప‌రంగా చ‌క్కటి వేరియేష‌న్ చూపించారు. ఎయిట్ ప్యాక్ లుక్ కోసం నాగ‌శౌర్య ఎంత క‌ష్ట‌ప‌డ్డారో తెర పైకి క‌నిపించింది. ఇక రితికా పాత్ర‌లో కేతిక శ‌ర్మ చాలా అందంగా క‌నిపించింది. అయితే.. ఆమె పాత్ర‌కు ప‌ర్ ఫార్మెన్స్ కు స్కోప్ లేదు. తెర పై అలా వ‌చ్చి ఇలా వెళ్లిపోయేది. దీంతో అస‌లు ఎందుకు హీరోయిన్ క్యారెక్ట‌ర్ ను పెట్టారా అనిపిస్తుంటుంది. పార్థుతో ఆమె ప్రేమ క‌థ చాలా పేల‌వంగా ఉంది.

నాగ‌శౌర్య త‌ర్వాత చెప్పుకోద‌గ్గ పాత్ర‌లు అంటే.. స‌చిన్, జ‌గ‌ప‌తిబాబుల పాత‌ర్లే. ఈ రెండు పాత్రలు సినిమాకి బ‌లాన్నిచ్చాయి. ఇక క‌థ గురించి చెప్పాల‌టే.. ద‌ర్శ‌కుడు సంతోష్ ఎంచుకున్న క‌థ‌లో కొత్తద‌నం ఉంది కానీ.. ఈ క‌థ‌ను ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించ‌డంలో త‌డ‌బ‌డ్డాడు. ముఖ్యంగా ఇలాంటి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ క‌థ‌తో సినిమా చేస్తే.. చివ‌రి వ‌ర‌కు ఏం జరుగుతుందో.. అనే ఉత్కంఠ క‌లిగించాలి. ఇందులో అది మిస్ అయ్యింది.

వైవా హ‌ర్ష‌, స‌త్య పాత్రలు ప్రధ‌మార్ధంలో ఒకట్రెండు స‌న్నివేశాల్లో న‌వ్వించాయి. కాల భైర‌వ నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకుంది. పాట‌లు విన‌సొంపుగా ఉన్నా.. మ‌రీ గుర్తంచుకునేలా లేవు. రామ్‌రెడ్డి కెమెరా వ‌ర్క్ బాగుంది. నిర్మాణ విలువ‌లు ఫ‌ర్వాలేద‌నిపించాయి.

చివరగా..ల‌క్ష్య గురిత‌ప్పింది

రేటింగ్ 2.5/5

Advertisement

Post Comment