పుష్ప – రివ్యూ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప‌. ఆర్య‌, ఆర్య 2 సినిమాల త‌ర్వాత బ‌న్నీ, సుక్కు క‌లిసి చేసిన సినిమా కావ‌డంతో ప్రారంభం నుంచి పుష్ప సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అభిమానులు అయితే.. ఎప్పుడెప్పుడు పుష్ప థియేట‌ర్లోకి వ‌స్తుందా అని ఎదురు చూశారు. ఈ మ‌ధ్య కాలంలో ఏ సినిమాకి రానంత క్రేజ్ పుష్ప‌కి వ‌చ్చింది. త‌గ్గేదేలే.. అంటూ పుష్ప‌రాజ్ ఈ నెల 17న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. మ‌రి.. పుష్ప‌రాజ్ క‌థ ఏంటి..? అంచ‌నాల‌ను ఎంత వ‌ర‌కు అందుకున్నాడు..? పుష్ప‌రాజ్ ఫ‌లితం ఏంటి..? అనేది చెప్పాలంటే ముందుగా క‌థ చెప్పాలి.

క‌థ

రాయలసీమలోని శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ జరుగుతూంటుంది. పోలీసులు చేసి లారీ డ్రైవర్ పుష్ప (అల్లు అర్జున్) ని పట్టుకుంటారు. అతన్ని అరెస్ట్ చేసి అసలు దీని వెనక ఎవరు అని పోలీసులు త‌మ‌దైన స్టైల్ లో ఆరా తీస్తారు. త‌న బాస్ పుష్ప‌రాజ్ అని త‌న గురించి చెప్ప‌డం స్టార్ట్ చేస్తాడు. పుష్ప‌రాజ్ కి బెయిల్ ఇప్పించేందుకు కొండారెడ్డి(అజయ్ ఘోష్) వస్తాడు. కొండారెడ్డి ఎర్రచందనం స్మగ్లింగ్ లో ఆరితేరినవాడు. ఇక కొండారెడ్డి లాంటి కొందరు స్మగ్లర్స్ ని వెనక నుంచి లీడ్ చేసే బాస్ మంగళం శీను(సునీల్). ఈ మంగ‌ళం శీనుకు రాజ‌కీయ నాయ‌కుడు (రావు ర‌మేష్) ఫుల్ స‌పోర్ట్ ఇస్తుంటాడు.

ఇదిలా ఉంటే.. ఎవ‌రి వెనుక తిరిగ‌ని పుష్ప‌రాజ్ తొలి ప్రేమ‌లోనే శ్రీవ‌ల్లి (ర‌ష్మిక‌) ప్రేమ‌లోప‌డతాడు. ఆమె చుట్టు తిరుగుతుంటాడు. అయితే.. మంగంళం శీను ఎర్ర‌చంద‌నంకు త‌క్కువ థ‌ర‌కు కొని బాగా ఎక్కువుకు అమ్ముతున్నాడ‌నే విష‌యం పుష్ప‌రాజ్ కి తెలుస్తుంది.ఆ క్రమంలో మంగళం శ్రీనుకు వార్నింగ్ ఇస్తాడు. అలా తన తెలివి, తెగువ తో ఆ స్మగ్లింగ్ సామ్రాజ్యంలో ముందుకు దూసుకుపోతూంటాడు పుష్ప. అయితే..అదే క్రమంలో అతని చుట్టూ పోలీసులు, మంగళం శ్రీను మనుషులు కమ్మేస్తూంటారు.
పుష్ప‌రాజ్ స్మ‌గ్లింగ్ సామ్రాజ్యానికి బాస్ అవుతాడు. శ్రీవ‌ల్లితో ప్రేమ వ్య‌వ‌హారం ఏమైంది..? మంగ‌ళం శీను ఎలా అంతం చేశాడు..? కొత్త‌గా వ‌చ్చిన భ‌న్వ‌ర్ సింగ్ షెకావ‌త్ (ఫ‌హ‌ద్ ఫాజిల్) క‌థ ఏంటి..? అనేది మిగ‌తా క‌థ‌

ప్లస్ పాయింట్స్

అల్లు అర్జున్ యాక్టింగ్
లవ్ ట్రాక్
ఇంట్రవెల్
కెమెరా వర్క్
ఐటమ్ సాంగ్

మైనస్ పాయింట్స్

లెంగ్త్ ఎక్కువ కావ‌డం
క్లైమాక్స్

విశ్లేష‌ణ

అల్లు అర్జున్ పుష్ప‌రాజ్ క్యారెక్ట‌ర్ లో అద‌ర‌గొట్టేసాడు. అస‌లు అల్లు అర్జున్ క‌న‌ప‌డ‌లేదు. అక్క‌డ పుష్ప‌రాజే క‌నిపించాడు. అంత‌లా పాత్ర‌లో దొరేశాడు. ఆడియ‌న్స్ ని మెప్పించాడు. ఇక పాలు అమ్ముకునే మిడిల్ క్లాస్ అమ్మాయి శ్రీవల్లిగా రష్మిక పాత్ర‌లో ఒదిగి పోయింది. వీళ్లిద్ద‌రి మ‌ద్య ల‌వ్ ట్రాక్ కొత్త‌గా ఉంది. సినిమాకే హైలైట్ అని చెప్ప‌చ్చు. ఇక పుష్పని ఇబ్బంది పెట్టే డీఎస్పీ గోవిందప్పగా శత్రు, ఎర్రచందనం స్మగ్లర్ కొండారెడ్డిగా అజయ్‌ ఘోష్‌, అతని తమ్ముడు జాలిరెడ్డిగా కన్నడ నటుడు ధనుంజయ్ పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్టుగా న‌టించారు. మంగళం శ్రీను పాత్రలో సునీల్ ని చూస్తే అతను ఇంతకు ముందు కామెడీ చేసేవాడు అంటే ఎవ‌రు న‌మ్మ‌రు. అంత విల‌నిజం చూపించాడు. మంగ‌ళం శీను భార్య అన‌సూయ పాత్ర‌బానే ఉంది కానీ.. ఆమె పాత్ర ఆశించినంత‌గా ఏమీ లేదు. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ పాత్ర బాగుంది.

దర్శకుడు సుకుమార్.. బ‌న్నీతో ఈ సినిమా చేయ‌డానికి ప్రాణం పెట్టి తీసాడ‌నిపిస్తుంది. ఆయ‌న క‌ష్టం తెర పై క‌నిపిస్తుంది. క‌థ‌ను ప‌ట్టుస‌డ‌ల‌కుండా న‌డిపిన విధానం చాలా బాగుంది. యాక్ష‌న్ సీన్స్ అయితే.. నెక్ట్స్ లెవ‌ల్ అన్న‌ట్టుగా డిజైన్ చేశాడు. సుకుమార్ కు తన సినిమాని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లటంతో టెక్నీషియన్స్ కు ఏ స్దాయి ప్రిఫరెన్స్ ఇవ్వాలో పూర్తిగా తెలుసు. అందరి నుంచి అద్బుతమైన అవుట్ ఫుట్ తీసుకుంటారు. ఎక్కడా కాంప్రమైజ్ కారు.

రామ్ లక్ష్మణ్, పీటర్ హెయిన్ యాక్షన్స్ సీన్స్ గూజ్ బంబ్స్ . కెమెరా వర్క్ నెక్ట్స్ లెవిల్ లో ఉంది. సినిమా లెంగ్త్ తగ్గించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇది సినిమా చూసిన ప్ర‌తీ ఒక్క‌రి మాట‌. ఏమాత్రం రాజీప‌డ‌కుండా మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని మంచి క్వాలీటీతో నిర్మించారు. టోట‌ల్ గా పుష్ప గురించి ఒక్క‌మాట‌లో చెప్పాలంటే.. పుష్ప బ్లాక్ బ‌స్ట‌ర్.. త‌గ్గేదేలే..

రేటింగ్ 3.25/5

Related Posts