ప‌రంప‌ర వెబ్ సిరీస్ – రివ్యూ

చ‌రిత్ర సృష్టించిన‌ బాహుబలి సినిమాతో పాటు వేదం, మ‌ర్యాద రామ‌న్న త‌దిత‌ర చిత్రాలు, అలాగే ప‌లు టీవీ సీరియ‌ల్స్ నిర్మించిన ఆర్కా మీడియా వ‌ర్క్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి ప్ర‌వేశించింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని పరంపర అనే వెబ్ సీరిస్ నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ శుక్రవారం నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మ‌రి.. వెబ్ సిరీస్ ఎలా ఉంది..? ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుందో..? ఇప్ప‌డు తెలుసుకుందాం.

క‌థ

విశాఖ జిల్లాకు చెందిన వీరనాయుడు (మురళీమోహన్‌) ప్రజల మనిషి. ప్ర‌జ‌ల‌కు ఏ క‌ష్టం వ‌చ్చినా నేనున్నాను అంటూ ముందుంటాడు. అక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం తన సొంత భూమిని ప్రభుత్వానికి ఇవ్వడంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని భూమిని కూడా పేద ప్రజలకు దానం చేసిన వ్యక్తి. ఆయన కొడుకులు మోహన రావు (జగపతిబాబు), నాగేంద్ర నాయుడు (శరత్‌ కుమార్‌). నిజానికి మోహ‌న‌రావు అనాథ. అయితే.. వీరనాయుడు మోహ‌న‌రావును దత్తతు తీసుకుంటాడు. సొంత కొడుకులా. పెద్ద కొడుకులా చూసుకుంటాడు. అతన్ని తన రాజకీయ వారసుడిని చేయాలి వీరనాయుడు భావిస్తాడు కానీ అంతలోనే హత్యకు గురవుతాడు.

తమ్ముడు నాగేంద్ర నాయుడు అభిప్రాయానికి విలువ ఇచ్చి మోహనరావు కుటుంబ వ్యవహారాలకే పరిమితమ�