మిస్సింగ్ – రివ్యూ
Latest Movies Reviews Tollywood

మిస్సింగ్ – రివ్యూ

నూత‌న న‌టీన‌టులు హర్ష నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ హీరో, హీరోయ‌న్లుగా రూపొందిన థ్రిల్ల‌ర్ మూవీ మిస్సింగ్.
ఈ చిత్రానికి శ్రీని జోస్యులు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. భ‌జ‌రంగబ‌లి క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రూపొందిన ఈ థ్రిల్ల‌ర్ మూవీ ట్రైల‌ర్ కి పాజిటివ్ టాక్ వ‌చ్చింది. దీంతో సినిమా పై క్యూరియాసిటీ ఏర్ప‌డింది. ఈరోజు (న‌వంబ‌ర్ 19న‌) మిస్సింగ్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి.. మిస్సింగ్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందా..? లేదా..? అనేది చెప్పాలంటే.. ముందుగా క‌థ‌లోకి వెళ్లాల్సిందే.

క‌థ –

గౌతమ్ (హర్ష నర్రా) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. శృతి (నికీషా రంగ్వాలా) వీరిద్దరూ అనుకోకుండా యాక్సిడెంట్ ద్వారా క‌లుసుకుంటారు. ఆత‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్య‌ స్నేహం ఏర్ప‌డ‌డం.. ఆ స్నేహం కాస్త ప్రేమ‌గా మార‌డం పెళ్లి చేసుకోవడం జ‌రుగుతుంది. గౌత‌మ్, శృతి ఇద్ద‌రు ఒక‌రంటే ఒక‌రు ప్రాణంగా ఉంటారు. అయితే.. ఓ రోజు గౌత‌మ్, శృతి కారులో బ‌య‌ట‌కు వెళుతుంటే.. ఆ కారుకు యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయిన త‌ర్వాత క‌ళ్లు తెరిచి చూస్తే గౌత‌మ్ హాస్ప‌ట‌ల్ లో ఉంటాడు. శృతి మిస్ అవుతుంది.

ఇక అక్క‌డ నుంచి అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. ఓ వైపు పోలీసులు శృతి ఎలా మిస్ అయ్యిందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. మ‌రో వైపు గౌత‌మ్ కూడా శృతి ఎలా మిస్ అయ్యిందో తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంటాడు. ఈ ప్ర‌య‌త్నంలో షాకింగ్ నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి. మ‌రో వైపు గౌత‌మ్ గ‌తం వెంటాడుతుంటుంది. ఇంత‌కీ గౌత‌మ్ గ‌తం ఏంటి..? శృతి ఎలా మిస్ అయ్యింది..? చివ‌రికి శృతి ఏమైంది అనేదే మిగిలిన క‌థ‌.

ప్ల‌స్ పాయింట్స్

హ‌ర్ష న‌ర్రా న‌ట‌న‌
క‌థ‌
శ్రీని జోస్యుల ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌
అజ‌య్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైన‌స్ పాయింట్స్

ప్ర‌థ‌మార్థం కాస్త స్లోగా ఉండ‌డం.
ట్విస్టులు ఎక్కువ అవ్వ‌డం..

విశ్లేష‌ణ 

గౌతమ్ పాత్రలో కనిపించిన హర్ష నర్రా కొత్తవాడైనప్పటికీ.. పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా చాలా చ‌క్క‌గా న‌టించాడు. డైలాగ్ డెలివ‌రీ, బాడీ లాంగ్వేజ్ ప్ర‌తిదీ ప‌ర్ ఫెక్ట్ అనేలా ఎంతో అనుభ‌వం ఉన్న న‌టుడులా న‌టించి మెప్పించాడు. ఇక హీరోయిన్ల విష‌యానికి వ‌స్తే.. శృతి పాత్ర‌లో ఆ పాత్ర స్వ‌భావానికి త‌గ్గ‌ట్టుగా నికీషా ఒదిగిపోయింది. గౌత‌మ్, శృతిల కెమెస్ట్రీ బాగుంద‌నిపించింది. జర్నలిస్టు పాత్రలో మిషా నారంగ్ తనదైన శైలిలో నటించింది. ఏసీపీ త్యాగి, సీఐ పాత్రలో రామ్ దత్, ఛ‌త్రపతి శేఖర్ ఆకట్టుకున్నారు.

ఇక ద‌ర్శ‌కుడు శ్రీని జోస్యుల గురించి చెప్పాలంటే.. సాధార‌ణంగా సినిమా స్టార్ట్ అయిన త‌ర్వాత పాత్రల ప‌రిచ‌యం చేస్తారు. ఆత‌ర్వాత అస‌లు క‌థ‌లోకి వెళ‌తారు కానీ.. ఏమాత్రం టైమ్ వేస్ట్ చేయ‌కుండా డైరెక్ట్ గా క‌థ‌లోకి తీసుకెళ్లి ఫ‌స్ట్ సీన్ నుంచి సినిమా పై ఆడియ‌న్స్ లో ఇంట్ర‌స్ట్ క్రియేట్ చేశాడు. ఇక క‌థ మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఊహ‌కంద‌ని ట్విస్టుల‌తో వాట్ నెక్ట్స్ అనేట్టుగా ఉత్కంఠ‌తో చూసేలా ఈ కథ‌ను అద్భుతంగా తెర‌కెక్కించ‌డంలో ద‌ర్శ‌కుడు నూటికి నూరు శాతం స‌క్స‌స్ అయ్యాడు అని చెప్ప‌చ్చు.

థ్రిల్ల‌ర్ జోన‌ర్ లో మూవీస్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. అజయ్ అరసాడ సీన్ కి త‌గ్గ‌ట్టుగా సంగీతం అందించి వేరే లెవ‌ల్ కి తీసుకెళ్లారు. డి. జానా సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే.. సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు ఇంట్ర‌స్టింగ్ గా చూసేలా ఉండాల‌నే ఉద్దేశ్యంతో ద‌ర్శ‌కుడు ట్విస్టులు ఎక్కువ‌పెట్టి కాస్త క‌న్ ఫ్యూజ్ చేసాడ‌ని చెప్ప‌చ్చు. ఏ సినిమాకైనా ట్విస్టులు ఎక్కువ అయితే.. టేస్ట్ పోతుంది. ఈ విష‌యం దృష్టిలోపెట్టుకునుంటే బాగుండేది. ఫైన‌ల్ గా చెప్పాలంటే.. థ్రిల్ల‌ర్ జోన‌ర్ మూవీస్ ఇష్ట‌ప‌డేవాళ్లు ఓసారి చూడ‌చ్చు.

రేటింగ్ 2.5/5

Post Comment