టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్న కుర్రాడు కిరణ్ అబ్బవరం. ఫస్ట్ మూవీ నుంచీ వైవిధ్యమైన ప్రయత్నాలు చేస్తున్నాడు. హిట్, ఫ్లాప్స్ తో పనిలేకుండా ప్రతి సినిమాకూ తనదైన శైలిలో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడుతున్నాడు. ఆ ఎఫర్ట్స్ ఫలించాయి. రీసెంట్ గా వచ్చిన వినరో భాగ్యము విష్ణుకథ సినిమా కమర్షియల్ గా పెద్ద విజయం సాధించింది. తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ షో నుంచి హిట్ టాక్ సొంతం చేసుకుని నిర్మాతలకు లాభాలు తెచ్చింది. ఇప్పుడు ఆ ఊపులో మీటర్ స్పీడ్ పెంచి మరీ వస్తున్నాడు కిరణ్. అతని లేటెస్ట్ మూవీ మీటర్ మూవీ ట్రైలర్ విడుదలైంది.


కిరణ్ అబ్బవరం సరసన అతూల్య రవి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ట్రైలర్ చూస్తే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ లా కనిపిస్తోంది. ఈ మూవీతో రమేష్ కాడూరి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. చింరజీవి, హేమలత పెదమల్లు నిర్మాతలు. వినరో భాగ్యము విష్ణుకథ చిత్రంలో కాస్త యాక్షన్ ను మిక్స్ చేసి మంచి రిజల్ట్ అందుకున్న కిరణ్ ఈ సారి పూర్తిగా మాస్ హీరోగా మారాడు అనిపిస్తోంది. ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. గతంలో సెబాస్టియన్ అనే సినిమాలో రేచీకటి ఉన్న పోలీస్ కానిస్టేబుల్ గా ఆకట్టుకున్న కిరణ్ ఈ సారి పోలీస్ ఇన్స్ పెక్టర్ పాత్రలో కనిపిస్తున్నాడు. తన తండ్రి కూడా పోలీస్. ఆయన ఆదర్శంగా డిపార్ట్ మెంట్ లోకి వచ్చిన అతనికి స్థానిక పొలిటీషియన్ తో ఎదురయ్యే ఇబ్బందులేంటీ.. ఆ పొలిటీషియన్ వల్ల లా అండ్ ఆర్డర్ లో ఎలాంటి సమస్యలు వచ్చాయి అనే పాయింట్స్ కనిపిస్తున్నాయి. ట్రైలర్ మొదటి భాగంలో ఎంటర్టైన్మెంట్ తో పాటు రొమాన్స్ కూడా ఉంది. రెండో భాగం మాత్రం పూర్తిగా మాస్ అంశాలతో నింపేశారు. చూస్తోంటే ఏప్రిల్ 7న విడుదల కాబోతోన్న మీటర్ తో మనోడు మరో మాంచి హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు.

, , , , , , , ,