రివ్యూ – ‘కపట నాటక సూత్రధారి’
Latest Movies Reviews Tollywood

రివ్యూ – ‘కపట నాటక సూత్రధారి’

నటీనటులు – విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాశ్, అరవింద్,మేక రామకృష్ణ,విజయ్

సాంకేతిక నిపుణులు

దర్శకుడు : క్రాంతి సైనా,

నిర్మాత : మనీష్ (హలీమ్),

సహా నిర్మాతలు : ఉమా శంకర్, వెంకటరామరాజు, శరత్ కుమార్, జగదీశ్వర్ రావు, శేషు కుమార్, ఎండి హుస్సేన్
సినిమాటోగ్రఫీ : సుభాష్ దొంతి
సంగీతం : రామ్ తవ్వా
నేపథ్య సంగీతం : వికాస్ బాడిశ
మాటలు : రామకృష్ణ
ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్
డాన్స్ : జిత్తు మాస్టర్

ఫ్రెండ్స్ అడ్డా పతాకంపై విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాష్, అరవింద్, మేక రామకృష్ణ, విజయ్, అమన్ ఖాన్, శ్రీరాగ్, నిరంజన్ నటీనటులు గా క్రాంతి సైన దర్శకత్వంలో మనీష్ (హలీమ్) నిర్మాణంలో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం ‘కపట నాటక సూత్రధారి’.  ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం.

కథ
ఒక బస్తీలో ఉన్న ఐదుగురు మెయిన్ క్యారెక్టర్స్ విజయ్ శంకర్ (యాదగిరి), సంపత్ కుమార్ (సెంథిల్,) చందులాల్ (పూర్ణ), అమీక్ష (పుష్ప), సునీత (కల్పన) లు లైఫ్ లో గోల్  ను అచీప్ కావాలనుకుని ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు అలాంటి తరుణంలో బ్యాంకులో లోన్ ఇప్పిస్తామని ఒక బ్యాంక్ ఎంప్లాయ్ చెప్పడంతో ఆ లోన్ అమౌంట్ తో లైఫ్ లో సెట్టవచ్చు అని లోన్ కు అప్లై చేస్తారు. అయితే వీరు అప్లై చేసిన బ్యాంకులో ఒక కష్టమర్స్ తను తాకట్టు పెట్టిన బంగారం విడిపించుకొని వెళితే అది నకిలీ బంగారం ఆని చెపుతారు.అలా ఆ బ్యాంక్ వారు  అసలు బంగారాన్ని మార్చి వన్ గ్రామ్ నకిలీ బంగారం పెట్టి కష్టమర్స్ కు ఇస్తుంటారు.ఈ విషయం తెలుసుకున్న అనేక మంది బ్యాంక్ కస్టమర్లు పోలీస్ స్టేషన్ కు వెళ్లి బ్యాంక్ మేనేజర్ పై కంప్లైంట్ ఇస్తారు.దీంతో ప్రభుత్వం పై ప్రెజర్ పెరగడంతో అరవింద్ (రుద్ర ) పోలీస్ ఆఫీసర్  బ్యాంక్ మేనేజర్ ను ఇన్వెస్టగేషన్ చేపడతాడు.అలా ఇన్వెస్టగేషన్ చేసే క్రమంలో బ్యాంక్ నుండి ఈ ఐదుగురు బస్తీ వారే కారణమని వారే 30 ఫెక్ అకౌంట్లను ఓపెన్ చేసి 99 కోట్లు అనగా 200 కేజీల బంగారం స్కాం చేశారని బ్యాంక్ వారు వీరిపై తోసేస్తారు. దీంతో పోలీస్ ఆఫీసర్ రుద్ర ఈ బస్తీ గ్యాంగ్ ను అరెస్ట్ చేయడానికి వెళ్తే వారు తప్పించుకొనే క్రమంలో వారిపై రుద్ర కాల్పులు జరపడంతో సునీత (కల్పన) చనిపోతుంది.ఆ తరువాత రుద్ర చేసే ఇన్వెస్టగేషన్ లో  అసలైన సూత్రాదారులు దొరికారు అనుకున్న టైం లో భానుచందర్ (బ్యాంక్ మేనేజర్ కృష్ణ మూర్తి), ఇలా ఒక్కొక్కరూ చనిపోతూ సినిమా మొత్తం సస్పెన్స్ తో సాగుతుంది .చివరికి ఈ స్కాము ఎవరు చేశారు? ఎందుకు బ్యాంక్ ఎంప్లాయిస్ చనిపోతూ వుంటారు? ఈ స్కామ్ నుంచి ఈ ఐదుగురు బస్తీ వాసులు బయటపడ్డారా.. లేదా..?  200 కేజీల బంగారం స్కాంను పోలీస్ డిపార్ట్మెంట్  కనిపెట్టిందా ? ఇంతకూ ఈ స్కాం లో అసలైన “కపట నాటక సూత్ర దారుడెవ్వరు?” అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…

ఎవరెలా చేశారంటే
హీరోగా నటించిన విజయ్ శంకర్ (యాదగిరి) తన పాత్రలో జీవించాడు,కమెడియన్ శివారెడ్డి తమ్ముడు సంపత్ కుమార్ (సెంథిల్) పాత్రలో చాలా చక్కగా నటించి  మెప్పించాడు. చందులాల్ (పూర్ణ) ఈ గ్యాంగ్ లో తెలివైన కుర్రాడిలా చక్కగా నటించాడు , అమీక్ష (పుష్ప) పూలమ్ము కొనే పాత్రలో ఒదిగిపోయి చాలా చక్కటి నటనను కనబరచింది, సునీత (కల్పన) ట్రాన్స్ జెండర్ పాత్రలో మెప్పించింది.అరవింద్ (రుద్ర ) పోలీస్ ఆఫీసర్ గా ఇన్వెస్టగేషన్ చేసే క్రమంలో తన విశ్వరూపాన్ని చూపించాడు. బ్యాంక్ మేనేజర్ గా బాను ప్రసాద్, మేక రామకృష్ణ, విజయ్,మాస్టర్ బాబా ఆహిల్, రవిప్రకాష్ వంటి నటీనటులు అందరూ తమ పరిధిమేర బాగా నటించారు.

సాంకేతిక నిపుణుల ప్రతిభ
రియల్ స్టోరీని ఎంచుకొని తీసిన కథలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ప్రేక్షకులు కూడా వీటిని బాగా ఆదరిస్తారు. అందుకే దర్శకుడు క్రాంతి సైన ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథకు… కొంత ప్రేమను జోడించి ఆద్యంతం ఆడియన్స్ ని ఆకట్టుకునేలా మూవీని ఎక్కడా బోరింగ్ లేకుండా చిత్రాన్ని తెరకెక్కించాడు.ఈ సినిమాలో దర్శకుడు ప్రధాన పాత్రల భావోద్వేగాలు, బ్యాక్‌ డ్రాప్‌ సెటప్, పాత్రల ఎలివేషన్స్ చాలా బాగున్నాయి.మంచి కాన్సెప్ట్ ను సెలెక్ట్ చేసుకొని ప్రేక్షకుల ముందుకు  తీసుకొచ్చిన దర్శకుడు క్రాంతి సైన సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. టెక్నికల్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు.రామ్ తవ్వ మంచి సంగీతం అందించాడు. ఇందులో ఉన్న పాటలన్ని బాగున్నాయి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సుభాష్ దొంతి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, ఎడిటర్ చోటా కె.ప్రసాద్ పనితీరు బాగుంది. రామకృష్ణ అందించిన మాటలు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి.ఈ”కపట నాటక సూత్ర దారి” సినిమాను ఫ్రెండ్స్ అడ్డా పతాకంపై మనీష్(హాలీమ్) ఈ సినిమాను ఖర్చుకు వెనకాడకుండా నిర్మాణంలో ఎక్కడా రాజీపడలేదని ఈ సినిమా చూసిన వారు ఎవరైనా చెబుతారు. చిత్రం క్లైమాక్స్ లో ఈ సినిమా పార్ట్ 2 కూడా వుంటుందని చెప్పడం కొసమెరుపు.మొత్తంగా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ “కపట నాటక సూత్రదారి” చిత్రాన్ని పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేయచ్చు.

Post Comment