ఇష్క్ – రివ్యూ
Latest Reviews

ఇష్క్ – రివ్యూ

ఓ బేబి చిత్రంలో ముఖ్య పాత్ర చేసి మెప్పించాడు. ఆతర్వాత జాంబీరెడ్డి సినిమాతో హీరోగా పరిచయమై తొలి ప్రయత్నంలోనే ఆకట్టుకున్నాడు యువ హీరో తేజ సజ్జా. తాజాగా తేజ సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్ జంటగా నటించిన చిత్రం ఇష్క్. ఈ చిత్రానికి ఎస్.ఎస్.రాజు దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. టీజర్, ట్రైలర్ యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉండడంతో సినిమా పై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ రోజు (జులై 30)న ఇష్క్ సినిమా థియేటర్స్ లో విడుదలైంది. మరి.. ఇష్క్ ఎలా ఉంది.? ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందా..? లేదా..? అనేది చెప్పాలటే ముందుగా కథ చెప్పాలి.

కథ

సిద్ధు (తేజ సజ్జా), అనూ (ప్రియా కాష్ వారియర్) ఒకరికొకరు ప్రేమలో పడతారు. ఓ రోజు ఈ ప్రేమికులు బయటకు వెళతారు. అయితే.. రాత్రి టైమ్ లో కారులో రొమాన్స్ చేసుకుంటుంటే.. మాధవ్ (రవీంద్ర విజయ్) అక్కడకు వస్తాడు. వాళ్లను ఫోటోలు తీస్తాడు. తను పోలీస్ అని బెదిరిస్తాడు. ఆ రాత్రంతా ఆ ప్రేమజంటను ఇబ్బంది పెడతాడు. ఆతర్వాత రోజు ఆ ప్రేమ జంట మధ్య గొడవ జరుగుతుంది. ఎందుకు గొడవ జరిగింది.? సిద్దు.. మాధవ్ పై ఎలా పగ తీర్చుకున్నాడు.? ఆఖరికి సిద్ధు, అనుల ప్రేమకథ ఏమైంది..? అనేదే ఈ కథ.

ప్లస్ పాయింట్స్

తేజ సజ్జా, ప్రియా ప్రకాష్‌ వారియర్
స్టోరీ

మైనస్ పాయింట్స్

పస్టాఫ్
అక్కడక్కడా సాగదీయడం..
కథనం

విశ్లేషణ

తేజ సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్ పాత్రకు తగ్గట్టుగా చాలా చక్కగా నటించారు. వారిద్దరి మధ్య కెమెస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. పాత్రను బాగా ఆర్థం చేసుకుని నటించాడు. ఫస్టాఫ్ లో రొమాంటిక్ యాంగిల్ చూపిస్తే.. సెకండాఫ్ లో రివేంజ్ యాంగిల్ చూపించాడు. ఇక రవీంద్ర విజయ్ కూడా శాడిష్ట్ క్యారెక్టరైజేషన్‌లో చక్కటి నటన కనబరిచాడు. ఎండింగ్ లో వచ్చిన ట్విస్ట్ కూడా బాగుంది. అయితే.. ఫస్టాఫ్ బోరింగ్ గా అనిపిస్తుంటుంది. ఏంటి.. కథ ముందుకు వెళ్లడం లేదు అనే ఫీలింగ్ కలిగిస్తుంది. లవ్ స్టోరీలకనే కాదు.. ఏ సినిమాకైనా కథను ముందుకు తీసుకెళ్లాలే.. ఫ్రెష్ గా ఉండాలే సన్నివేశాలను రాసుకోవాలి.

అలా రాసుకోకపోవడంతో… సినిమా చూస్తున్నంత సేపు సాగదీసినట్టుగా అనిపిస్తుంది. కథనం ఈ సినిమాకి మైనస్ అని చెప్పచ్చు. దర్శకుడు మంచి పాయింట్ ను తీసుకున్నప్పటికీ.. దానిని కరెక్ట్ గా ఇంట్రస్టింగ్ గా ఉండేలా తెరకెక్కించడంలో ఫెయి్ అయ్యాడని చెప్పచ్చు. కథనం పై ఇంకాస్త దృష్టి పెట్టి రాసుకుని ఉంటే.. మంచి ఫలితం వచ్చేది. రొమాన్స్, రివేంజ్ తరమా ప్రేమకథలను ఇష్డపడే వాళ్లు ఇష్క్ సినిమాను ఒకసారి చూడచ్చు.

రేటింగ్ 3/5

Post Comment