ఛలో ప్రేమిద్దాం – రివ్యూ
Latest Movies Reviews Tollywood

ఛలో ప్రేమిద్దాం – రివ్యూ

నటీనటులు 

సాయి రోనక్, నేహా సోలంకి, శ‌శాంక్, సిజ్జు, అలీ, నాగినీడు, పోసాని కృష్ణ‌ముర‌ళి, ర‌ఘుబాబు, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, హేమ‌, ర‌ఘు కారుమంచి, సూర్య‌ తదితరులు

టెక్నీషియన్స్ 

సంగీతం – భీమ్స్ సిసిరోలియో, పాట‌లు – సురేష్ గంగుల‌, దేవ్‌, ఎడిటింగ్ – ఉపేంద్ర జ‌క్క‌, సినిమాటోగ్ర‌ఫీ – అజిత్ వి.రెడ్డి, జ‌య‌పాల్ రెడ్డి , నిర్మాత – ఉద‌య్ కిర‌ణ్‌, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం – సురేష్ శేఖ‌ర్ రేప‌ల్లె.

కథేంటంటే

కాలేజ్ లో మొదలయ్యే కథ ఇది. ఆత్మారావు (సాయి రోనక్) ఉన్నత విద్య కోసం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చిన కుర్రాడు. అదే కాలేజ్ లో చదివే మధుమతి (నేహా సోలంకి)ది రాయలసీమలోని చిత్తూరు. వీళ్ల మధ్య ఇలా మొదలైన స్నేహం మధుమతి స్నేహితురాలికి ఆత్మారావు సాయం చేయడంతో ప్రేమగా మారుతుంది. అతని మంచి మనసుకు పడిపోతుంది మధుమతి. కానీ మనసులో ఉన్న ప్రేమను చెప్పదు. ఎందుకంటే దానికి కారణం ఆమె కుటుంబ నేపథ్యం. ఆత్మారావుతో లవ్ ప్రపోజ్ ఓకే చేయకుండానే ఊరెళ్లిపోతుంది మధుమతి. ఆమె సోదరి పెళ్లికి ఆత్మారావుతో సహా స్నేహితుల బృందమంతా వెళ్తుంది. అక్కడ కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఊరి పెద్ద మధుమతి మామయ్య పెద్దప్ప (నాగినీడు), మధుమతి సోదరుడు శివుడు (సూర్య) గొడవలకు కారణం అవుతారు. ఇంతలో మధుమతి కిడ్నాప్ అవుతుంది. ఆమెను ఎవరు కిడ్నాప్ చేశారు. ఈ గొడవల నుంచి హీరో హీరోయిన్లు ఎలా బయటపడ్డారు అనేది మిగిలిన కథ.

ఎలా ఉందంటే

ఛలో ప్రేమిద్దాం ప్రారంభం నుంచీ రొటీన్ సాగే సినిమా. హీరోయిన్ చాలా ఇన్నోసెంట్. చెట్లు నరికినా చూడలేదు. చెట్లను ప్రేమించమని చెబుతుంది. మన సినిమాల్లో హీరోయిన్లు ఇంత సుకుమారులా అనిపిస్తుంది. ఇక హీరో ఊరికే పాటలు పాడేస్తూ, ఫైట్స్ చేస్తుంటాడు. హీరోయిన్ తో కలిసి విసిగించే కామెడీ తో నవ్వించేందుకు ప్రయత్నిస్తుంటాడు. తను తాగిన టీ అమ్మి, ఒక్కో టీ గ్లాసుకు 200 వసూలు చేస్తుంది హీరోయిన్. మన టైమ్ బాగుండి ఈ విషయంలో టీ ఎంగిలి దగ్గరే ఆపేసింది. కాలేజ్ లో ఫ్రెండ్స్, ఈ లవ్ ఎఫైర్ తో సగటు ప్రేమ కథను గుర్తు చేస్తుంది ఛలో ప్రేమిద్దాం. సెకండాఫ్ రాయలసీమకు మారినప్పుడు కూడా అక్కడా కథ వేగం పెరగదు, కొత్తదనం కనిపించదు. అదే విలనీలు, అదే గొడవలు. మన విలన్లకు ఇంత అకారణ స్వార్థం ఎందుకో అర్థం కాదు. ఊరి పెద్ద పెద్దప్ప (నాగినీడు) తన కనుసన్నల్లో ఊరిలో సాగిస్తుంటాడు. మధుమతి కిడ్నాప్ వ్యవహారం, ఆపై హీరో విలన్లకు చేసే ఉపదేశం కూడా పరమ నాటు, రొటీన్, విసిగించేస్తుంది. మొత్తంగా ఛలో ప్రేమిద్దాం సగటు చిత్రంగా మిగిలిపోతుంది.

రేటింగ్ 2.5/5

Post Comment