మరో “రక్త చరిత్ర” – ఆర్జీవీ “కొండా” ట్రైలర్ రివ్యూ

ఒక పాట్రన్ కథలు పట్టుకుంటే ఇక అదే రూట్ లో దంచుకుంటూ వెళ్తుంటాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఒక దశలో వరుసగా మాఫియా చిత్రాలు, ఆ తర్వాత కంటిన్యూగా హారర్ సినిమాలు చేస్తూ వచ్చాడు. గత కొన్నాళ్లుగా భయపెట్టే బయోపిక్ లు రూపొందిస్తున్నాడు. ఈ క్రమంలో వర్మ చేసిన మరో జీవిత కథా చిత్రం కొండా. వరంగల్ రాజకీయ నాయకుడు కొండా మురళి, మాజీ మంత్రి కొండా సురేఖ జీవిత కథల ఆధారంగా ఈ సినిమాను రూపొందించాడు రామ్ గోపాల్ వర్మ. త్రిగుణ్ గా పేరు మార్చుకున్న అరుణ్ ఆదిత్ కొండా మురళి పాత్రలో నటిస్తుండగా, ఇర్రా మోర్ కొండా సురేఖ పాత్రను పోషించింది. కొండా సినిమా ట్రైలర్ ఇవాళ విడుదల చేశారు. రక్త చరిత్ర సినిమాకు వర్మ వాయిస్ ఓవర్ చెప్పినట్లే, అదే ఎఫెక్ట్ తో కొండా సినిమాకు చెప్పారు. వర్మ వాయిస్ తోనే ట్రైలర్ ప్రారంభమవుతుంది.

ఈ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే….సమాజం గురించి నీతులు చెప్పుడు కాదు బాగు చేయాలి నీకు పోయేది ఏం లేదు బానిస సంకెళ్లు తప్ప అంటూ ట్రైలర్ ప్రారంభమైంది. కొండా మురళి కాలేజ్ జీవితం, ఆ తర్వాత ఊరిలో కొందరు పెద్దలను ఎదిరించి పోరాడటం, ఆ తర్వాత నక్సలైట్లతో పరిచయం, చివరగా రాజకీయాల్లోకి రావడం ఇవన్నీ ట్రైలర్ లో చూపించారు. రాజకీయం అండ లేకుండా ఏం చేసినా రౌడీయిజం అంటారు, విపరీతమైన పరిస్థితులే విపరీతమైన వ్యక్తులను పుట్టిస్తాయి అనే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. హీరో త్రిగుణ్, ఇర్రా మోర్ క్యారెక్టర్ లు ఇంటెన్స్ గా ఉన్నాయి. మేకింగ్ వాల్యాస్ వర్మ గత అన్ని చిత్రాల్లాగే లో గ్రే