Advertisement
రివ్యూ – నయీం డైరీస్
Latest Movies Reviews Tollywood

రివ్యూ – నయీం డైరీస్

Advertisement

నటీనటులు – వశిష్ట సింహ, యజ్ఞ శెట్టి, దివి, బాహుబలి నిఖిల్‌, శశి కుమార్‌, జబర్దస్త్‌ ఫణి తదితరులు

సాంకేతిక నిపుణులు- సినిమాటోగ్రఫీ – సురేష్‌ భార్గవ్‌, సంగీతం– అరుణ్‌ ప్రభాకర్‌, ఎడిటర్‌ – కిషోర్‌ మద్దాలి, పీఆర్వో – జి యస్ కె మీడియా, నిర్మాత సీఏ వరదరాజు, రచన దర్శకత్వం దాము బాలాజీ

గ్యాంగ్ స్టర్ నయీం జీవిత కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన సినిమా నయీం డైరీస్. వశిష్ట సింహ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. దాము బాలాజీ దర్శకత్వం వహించిన నయీం డైరీస్ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథగా చూస్తే

విప్లవానికి ఆకర్షితుడైన నయీం (వశిష్ట సింహా) నక్సల్స్ ఉద్యమంలో చేరుతాడు. ఫేక్ ఎన్ కౌంటర్ సందర్భంగా పోలీసులకు పట్టుబడతాడు. పట్టుబడిన నయీం, ఇతర నక్సలైట్ నాయకులకు జైలు శిక్ష పడుతుంది. నయీం సోదరిపై అత్యాచార యత్నం చేసిన వ్యక్తికి చిన్న శిక్ష విధించి నక్సల్స్ వదిలేయడం నయీం, అతని సోదరుడి వలీకి నచ్చదు. జైల్లో ఉన్న నయీం సోదరుడు వలీ సహాయంతో తన సోదరిపై అత్యాచారయత్నం చేసిన వ్యక్తిని చంపిస్తాడు. దీంతో పార్టీ గీత దాటినందుకు నయీంను నక్సలైట్లు కమిటీ నుంచి బహిష్కరిస్తారు. ఈ హత్య కేసులో నయీం సోదరిపై పోలీసు ఆఫీసర్ (శశి కుమార్) ఒత్తిడి తీసుకొస్తారు. ఇంతలో వలీ హత్య జరుగుతుంది. సోదరుడిని చంపింది నక్సలైట్ ప్రోద్బలంతోనే నని తెలుసుకుంటాడు నయీం. సోదరిపై పోలీసులు పెడుతున్న ఒత్తిడి, తమ్ముడి హత్యతో నక్సలైట్ల ఏరివేతలో పోలీసులకు సహకరించేందుకు నయీం ఒప్పుకుంటాడు. ఉద్యమకారిని, తన ప్రేయసి అయిన లత (సంయుక్త) సహకారం కోరతాడు. నక్సలైట్ ఉద్యమాన్ని ప్రాణంగా ప్రేమించిన నయీం, ఆ నక్సలైట్ల ఎన్ కౌంటర్ లకు ఎలా సారథ్యం వహించాడు. పోలీసు, రాజకీయ వ్యవస్థలు, కుటుంబ ప్రేమ అతన్ని ఎలా క్రూరమైన నేరస్తుడిగా మార్చాయి అనేది మిగిలిన కథ.

ఫ్లస్ పాయింట్స్

వాస్తవిక చిత్రణ
వశిష్ట సింహ నటన
కథపై చేసిన రీసెర్చ్

మైనస్ పాయింట్స్

ఎక్కువైన హింస
నాటకీయత లోపించడం

విశ్లేషణ…

నయీం డైరీస్ సినిమాలో ప్రతి పాత్ర సహజంగా ప్రవర్తిస్తుంటుంది. సినిమాను సాధ్యమైనంత వాస్తవికంగా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. అక్కర్లేని కమర్షియల్ అంశాల జోలికి పోలేదు. నక్సలైట్లు, పోలీసుల మధ్య ఆధిపత్య పోరులో నయీం ఒక్కోసారి ఒక్కో వర్గం వైపు ముందుండి నడిపించాడు. నయీం మంచివాడు అనే వత్తాసు పలకకుండా బ్యాలెన్స్డ్ గా ఏం జరిగింది, మనకు తెలియని పాత్రల ప్రభావం నయీం జీవితం మీద ఏంటి అనేది సినిమాలో చూపించారు.

వశిష్ట సింహా నయీం పాత్రలోనే ఇంటెన్సిటీని తన నటనలో చూపించారు. నయీం సోదరిగా నటించిన యజ్ఞశెట్టి పాత్రోచితంగా నటించింది. లత పాత్రలో సంయుక్త పాత్ర సినిమాకు మరో ఆకర్షణ. తన ప్రేమనంతా మాటల్లో కాకుండా చూపుల్లోనే కనబర్చింది. జబర్దస్త్ ఫణి, దివి వద్యాత మిగతా పాత్రధారులంతా పరిధి మేరకు నటించారు. సురేష్ భార్గవ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అరుణ్ ప్రభాకర్ సంగీతం ఫర్వాలేదు. వాస్తవికంగా సినిమాను చూపే ప్రయత్నంలో హింస ఎలా జరిగిందో అలాగే తెరకెక్కించారు. ఇది చూసేందుకు చాలా ఇబ్బందిగా ఉంది. దీన్ని కాస్త తగ్గించి ఉంటే బాగుండేది.

రేటింగ్ 2/5

Advertisement