హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్‌ కాంబినేషన్ లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్’. కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తోంది. సర్దార్‌లో రాశి ఖన్నా కథానాయికగా నటిస్తుండగా, రజిషా విజయన్, చుంకీ పాండే కీలక పాత్రలలో కనిపించనున్నారు

ఇటివలే విడుదలైన ‘సర్దార్’ టీజ‌ర్‌ కి అన్ని వర్గాల ప్రేక్షల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. టీజర్‌లో కార్తి ఆరు విభిన్న గెటప్స్ , బ్రిలియంట్ ఫెర్ ఫార్మెన్స్, వైవిధ్యమైన కథ సినిమాపై భారీ అంచనాలని పెంచింది.  పిఎస్ మిత్రన్ తన అవుట్ స్టాండింగ్ తో ఆకట్టుకున్నారు. భారీ నిర్మాణ విలువలు వున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు,.

సర్దార్ 2022 దీపావళికి తెలుగు, తమిళంలో థియేట్రికల్ విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తుండటంతో సహజంగానే ఈ చిత్రం తెలుగులో భారీ సంఖ్యలో గ్రాండ్ గా థియేటర్ లో విడుదలౌతుంది.  

, , , , , , , , , , , , , , ,