మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా రూపొందుతోన్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ RC 15(వ‌ర్కింగ్ టైటిల్‌). ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ చెన్నైలో జ‌రుగుతోంది. సినిమాను సెట్స్‌లో కాకుండా జ‌నాల మ‌ధ్య‌నే చిత్రీక‌రిస్తున్నారు. అయితే ఇప్పుడ‌దే చిత్ర యూనిట్‌కి ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింది. అదేంటంటే.. చుట్టు ప‌క్క‌ల ఉన్న జ‌నం సినిమాను మొబైల్స్‌లో చిత్రీక‌రించి నెట్టింట పోస్ట్ చేస్తున్నారు.

అలాగే త‌మ‌న్ కంపోజ్ చేసిన ఓ పాట కూడా లీకైంది. సినిమా తీయ‌ట‌మే క‌ష్ట‌మ‌నుకంఉటే దాన్ని లీక్ కాకుండా కంట్రోల్ చేయ‌ట‌మ‌నేది నిర్మాత‌లకు చాలా ఇబ్బందిగా మారింది. దీంతో వారు సోష‌ల్ మీడియాలోనే అభిమానుల‌ను, ఫ్యాన్స్‌ను రిక్వెస్ట్ చేశారు. సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న కంటెంట్‌ను వైర‌ల్ చేయ‌కండంటూ రిక్వెస్ట్ చేశారు. మ‌రి నిర్మాత‌ల రిక్వెస్ట్‌ను ఎవ‌రూ ఫాలో అవుతారో చూడాలి మ‌రి.

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో RC 15 సినిమా తెర‌కెక్కుతోంది. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే సినిమా 60 శాతానికి పైగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేసేలా మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో చ‌రణ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు. ముఖ్య‌మంత్రి, ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా మెగాస్టార్ త‌న‌యుడు ఆక‌ట్టుకోబోతున్నారు. కియారా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో శ్రీకాంత్‌, ఎస్‌.జె.సూర్య‌, సునీల్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు.

, , , , , , , , , , , , ,