Advertisement
వరుస అనౌన్స్ మెంట్స్ తో హోరెత్తించనున్న రవితేజ
Latest Movies Tollywood

వరుస అనౌన్స్ మెంట్స్ తో హోరెత్తించనున్న రవితేజ

Advertisement

మాస్ మహరాజా రవితేజ క్రాక్ హిట్ తర్వాత కాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆ విజయం అతనికి కాన్ఫిడెన్స్ ను పెంచింది. అంతకు ముందు వరుస ఫ్లాప్ లు చూసిన ఈ మాస్ రాజాతో పాటు అతని అభిమానులకూ మాస్ బిర్యానీ అందించింది. ఈ క్రమంలో ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. క్రాక్ టైమ్ లోనే అనౌన్స్ అయిన ఖిలాడీ ఓ షెడ్యూల్ ఇంకా బ్యాలన్స్ ఉంది. ఈ షెడ్యూల్ ను విదేశాల్లో చిత్రీకరించాల్సి ఉందట. అక్కడ ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతానికి ఖిలాడీని హోల్డ్ లో పెట్టాడు. కానీ తర్వాత ఒప్పుకున్న సినిమా అప్డేట్స్ తో హోరెత్తించబోతున్నాడు రవితేజ. అది ఈ డిసెంబర్ నుంచి జనవరి వరకూ ఉండబోతోందట.
స్టూవర్ట్ పురం దొంగ నాగేశ్వరరావు కథతో చేస్తోన్న టైగర్ నాగేశ్వరరావు మూవీ ఫస్ట్ లుక్ ను ఈ నెలలో విడుదల చేయబోతున్నారు. యేళ్ల పాటు పోలీస్ లకు దొరకకుండా సవాల్ విసిరిన వ్యక్తి నాగేశ్వరరావు. అలాంటి వ్యక్తి కథలో రవితేజ అంటే మాస్ ఆడియన్స్ కు పండగే అనుకోవచ్చు.
ఇక రావణాసుర చిత్రానికి సంబంధించి హీరోయిన్ తో పాటు ఇతర కాస్ట్ అండ్ క్రూను ప్రకటిస్టారట. ఈ మూవీలో రవితేజ కూడా పది తలలతో ఆలోచించేలాంటి వ్యక్తి పాత్రలో కొత్తగా కనిపిస్తాడంటున్నారు. ఈ పాత్రలో అనేక షేడ్స్ ఉంటాయని కూడా టాక్. ఇక ఈ మూవీతో శ్రీకాంత్ విస్సా అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు.
మార్చి 25న విడుదల అని అనౌన్స్ చేసిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రం టీజర్ ను కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నారని అనౌన్స్ చేశారు. రామారావు ఆన్ డ్యూటీలో రవితేజ గవర్నమెంట్ అధికారిగా నటిస్తున్నాడు. ఈ చిత్రం బాగా వస్తోందనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. శరత్ మండవ ఈ మూవీతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. క్రిస్మస్ లేదా జనవరి ఫస్ట్ న ఈ మూవీ టీజర్ విడుదల చేయబోతున్నారు. రామారావు ఆన్ డ్యూటీలో రవితేజ సరసన మజిలీ ఫేమ్ దివ్యాంశా కౌషిక్, తమిళ్ కర్ణన్ మూవీ ఫేమ్ రాజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇక త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ధమాకా. రవితేజ ఇమేజ్ కు తగ్గట్టుగా మాస్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ మూవీలో లేటెస్ట్ పెళ్లి సందడి బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం. ఇక ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేయబోతున్నారు.
అలాగే ఈ అన్ని సినిమాల కంటే ముందే మొదలైన సినిమా ఖిలాడీ నుంచి కూడా మూడో పాటను విడుదల చేయబోతున్నారు. ఈ మూవీ నుంచి ఆల్రెడీ వచ్చిన రెండు పాటలూ సూపర్ హిట్ అనిపించుకున్నాయి. మరి ఈ పాట ఎలా ఉండబోతోందో కానీ.. ముందు స్టార్ట్ అయిన ఖిలాడీ చివర్లో విడుదలవతుందంటున్నారు.
మొత్తంగా డిసెంబర్ జనవరిలో రవితేజ కొత్త సినిమా అప్డేట్స్ లో అభిమానులను హోరెత్తించబోతున్నాడన్నమాట.

Advertisement