Advertisement
5 సినిమాల‌తో ర‌వితేజ‌ భారీ లైనప్
Latest Movies Tollywood

5 సినిమాల‌తో ర‌వితేజ‌ భారీ లైనప్

Advertisement

మాస్ మ‌హారాజా ర‌వితేజ మ‌ళ్లీ ఫుల్ ఫామ్ లోకి వ‌చ్చేశాడు. ఏమాత్రం ఖాళీ లేకుండా వ‌రుస‌గా సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయ‌న‌తో సినిమాలు చేసేందుకు నిర్మాత‌లు క్యూక‌డుతున్నారు. ఇప్పుడు ర‌వితేజ ఒక‌టి కాదు.. రెండు కాదు.. ఏకంగా 5 సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ప్రతీ సినిమా కోసం 10 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు రవితేజ. క్రాక్ ముందు వరకు కూడా స్లో అండ్ స్టడీగానే ఉన్న రవితేజ కెరీర్.. ఒక్క బ్లాక్‌బస్టర్‌తో రేంజ్ మారిపోయింది. ఇంత‌కీ.. రవితేజ చేస్తున్న ఆ.. అయిదు సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం..

ముందుగా చెప్పాల్సింది ఖిలాడీ. రవితేజ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రానికి వీర సినిమా చేసిన రమేష్ వర్మ దర్శకుడు. ఈ భారీ చిత్రాన్ని 2022, ఫిబ్రవరి 11న విడుదల చేయ‌నున్నారు. ఇక రెండో సినిమా రామారావు ఆన్ డ్యూటీ. కొత్త దర్శకుడు శరత్ మండవ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో గవర్నమెంట్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు రవితేజ. ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతుంది. ఇక మూడ‌వ సినిమా ధమాకా. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రాబోతుంది.

Dhamaka (2022) | Dhamaka Movie | Dhamaka Telugu Movie Cast & Crew, Release  Date, Review, Photos, Videos – Filmibeat

ర‌వితేజ చేస్తున్న నాలుగ‌వ చిత్రం టైగర్ నాగేశ్వరరావు. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ఈ సినిమా. వంశీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోనూ విడుదల కానుంది. ఈ సినిమా కోసం రవితేజ 18 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక ర‌వితేజ న‌టిస్తున్న 5వ చిత్రం రావణాసుర. యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది. ఇందులో రవితేజ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. వీటితో పాటు మ‌రికొన్ని సినిమాలు చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి.

Ravi Teja's Tiger Nageswara Rao first poster out. See here - Movies News

Ravanasura - IMDb

 

Ravi Teja's Ramarao On Duty First Look Motion Teaser | #RT68 | MS  entertainments - YouTube

 

 

Advertisement