సమ్మర్ లో రిలీజ్ లతో తెలుగు సినిమా పరిశ్రమలో మోత మోగబోతోంది. వరుసగా ఇప్పటికే పెద్ద సినిమాలన్నీ రిలీజ్ డేట్స్ ను అనౌన్స్ చేశాయి. వీళ్లంతా ఆయా డేట్స్ లో వచ్చేందుకు మొత్తంగా సిద్ధమైపోయారు. కొందరు మాత్రం రెండు డేట్స్ వేసుకుని ఎప్పుడు వస్తామో త్వరలో చెబుతాం అంటూ సస్పెన్స్ లో పెట్టేశారు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయితే అసలు గొడవంత పోతుందనేది చాలామంది భావన. వారి కోసం చాలా సినిమాలు ఇబ్బంది పడ్డాయి.. పడుతున్నాయి కూడా. ఏదైతేనేం.. ఫైనల్ గా నిర్మాతలంతా కలిసి కూర్చుని ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ నిర్ణయాల్లో ఓ కీలకమైన సినిమాను వదిలేశారు. అదే మాస్ మహరాజ్ రవితేజ రామారావు ఆన్ డ్యూటీ.
వీళ్లంతా ఇప్పుడు డేట్స్ అనౌన్స్ చేయడానికి ముందే రామారావు ఆన్ డ్యూటీ చిత్రాన్ని మార్చి 25న విడుదల చేస్తాం అని ప్రకటించారు వీళ్లు. వారు అనౌన్స్ చేసి కూడా చాలా రోజులవుతోంది. బట్.. ఆ చిత్రాన్ని పట్టించుకోకుండా ప్రొడ్యూసర్స్ గిల్డ్ కొత్త రిలీజ్ డేట్స్ ను ఫిక్స్ చేసిందని తెలుస్తోంది. లేదంటే అంతా ప్రకటించాక ఇవాళ(మంగళవారం) రామారావు ఆన్ డ్యూటీ మూవీ మేకర్స్ తమ డేట్ ను ప్రకటించాల్సి వచ్చింది. దీన్నిబట్టే ఈ చిత్రాన్ని పరిగణలోకి తీసుకోలేదు అని తెలుస్తుంది.
అయితే రవితేజ సినిమా కూడా ఏమాత్రం తగ్గేదే లేదు అన్నట్టుగా వస్తుందని వాళ్లు కొత్తగా ప్రకటించారు. అంటే ముందే చెప్పినట్టుగా మార్చి 25న లేదా ఏప్రిల్ 15న వస్తాం అని ప్రకటించారు. మార్చి 25న రావడం కుదిరినా.. ప్రస్తుతం ఆ ప్రొడ్యూసర్స్ గిల్డ్ రానివ్వదు. అంటే ఏప్రిల్ 15 ఉంది. కానీ అదే రోజు మూడు భారీ చిత్రాలున్నాయి. కెజీఎఫ్ చాప్టర్2, విజయ్ నటించిన బీస్ట్, లాల్ సింగ్ ఛద్దా. ఈ మూడూ ఇతర భాషల చిత్రాలే అయినా తెలుగులోనూ వాటి ఇంపాక్ట్ కనిపిస్తుంది. అది ఇన్ డైరెక్ట్ గా రామారావు మీద పడుతుంది. అయినా విడుదల చేస్తారా అనేది పెద్ద ప్రశ్న. మొత్తంగా నిర్మాతలంతా కలిసి చర్చించుకుని కొత్త సినిమాల రిలీజ్ డేట్స్ ను అనౌన్స్ చేశారు అనే మాటలో నిజం లేదనేది రామారావు పరిస్థితి చూస్తే సులువుగానే అర్థమవుతుంది. మొత్తంగా అంతా కలిసి రవితేజ చిత్రాన్ని ఇరికించినట్టున్నారు. మరి రామారావు ఈ సమస్యను ఎలా సాల్వ్ చేస్తాడో చూడాలి.

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,