టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్లలో రష్మిక ఒకరు. ఆమె ఏ సినిమాకు సైన్‌ చేసినా హిట్‌ అవుతుండటంతో గోల్డెన్‌ లెగ్‌ అనే పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే నేమ్‌ బాలీవుడ్‌లో కూడా వినిపించాలని గట్టిగా మొక్కుకుంటున్నారు. ఆమె నటించిన బాలీవుడ్‌ సినిమా రిలీజ్‌ ముహూర్తం ఈ దసరాకు కుదిరింది. నార్త్ లో ఇప్పటికే చాలా ఫంక్షన్లకు అటెండ్‌ అయ్యారు రష్మిక. అయితే వెళ్లిన ప్రతిసారీ వెస్టర్న్ కాస్ట్యూమ్స్ ని క్యారీ చేయలేక ఇబ్బందిపడిపోతూ ట్రోల్స్ కి గురయ్యారు. అయితే ఈ సారి మాత్రం అలాంటి ట్రోలర్లు తననేమీ చేయలేరనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మేరా పాస్‌ అమితాబ్‌ హై అంటూ నార్త్ జనాలకు జలక్‌ ఇస్తున్నారు.
ఇంతకీ విషయం ఏంటంటే, రష్మిక నటించిన గుడ్‌బాయ్‌ సినిమా అక్టోబర్‌ 7న విడుదల కానుంది.

ఈ సినిమాలో అమితాబ్‌తో కలిసి నటించారు రష్మిక మందన్న. బాలాజీ టెలిఫిల్మ్స్ , గుడ్‌ కో, సరస్వతి ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి ఈ సినిమాను నిర్మించాయి. వికాస్‌ భాల్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్‌కి సెప్టెంబర్‌6 ముహూర్తం ఫిక్స్ చేశారు. లేటెస్ట్ గా విడుదలైన ఫన్‌ ప్రమోషనల్‌ వీడియో ఇన్‌స్టంట్‌గా వైరల్‌ అయింది. అమితాబ్‌ తన పార్ట్ సూపర్‌గా చేశారంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు రష్మిక. ఈ సినిమా షూటింగ్‌కి తన కుక్కపిల్లతో వెళ్లి స్పెషల్‌ గుర్తింపు తెచ్చుకున్నారు కూర్గు బ్యూటీ.

తన తొలి బాలీవుడ్‌ సినిమా చూసిన జనాలు నవ్వుతారు, ఏడుస్తారు, ఎమోషన్‌ ఫీలవుతారు అంటూ చెప్పుకొచ్చారు కన్నడ భామ.ఈ దసరాకు ముంబైలో రష్మిక సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఆమెకన్నా రెండు రోజుల ముందే గాడ్‌ఫాదర్‌తో ముంబై వీధుల్లో హల్‌చల్‌ చేయడానికి సిద్ధమవుతున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. ఆయన హీరోగా నటించిన గాడ్‌ఫాదర్‌లో సల్మాన్‌ కీ రోల్ ప్లే చేశారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీలో రిలీజ్‌ చేస్తున్నారు.మరోవైపు నాగార్జున కూడా అక్టోబర్‌ 5న ఘోస్ట్ తో దసరా సందడి చూపించనున్నారు. గతంలో నాగార్జున, రష్మిక కలిసి దేవదాస్‌ సినిమాలో నటించారు. అప్పటి నుంచీ వీరిద్దరి మధ్య మంచి ర్యాపో ఉంది. సో ఈ దసరాకు చిరు అండ్‌ నాగ్‌కి ఇలా గుడ్‌బాయ్‌ చెబుతున్నారన్నమాట.

, , , , , , ,