కంట్రీలో ఇప్పుడు క్రేజీ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే ఫస్ట్ రో లో ఉండే బ్యూటీ రష్మిక మందన్నా. సౌత్ తో పాటు బాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూకుడు చూపుతోందీ కన్నడ కస్తూరి. వరుసగా భారీ సినిమాలు చేస్తోంది. ప్రతి సినిమాకూ ప్రమోషన్స్ పరంగానూ ఆకట్టుకుంటోంది. అందుకే రష్మికను రిపీట్ చేయడానికి హీరోలూ ఇష్టపడుతున్నారు. అలా అమ్మడు లేటెస్ట్ గా ఓ కోలీవుడ్ మూవీకి సైన్ చేసింది.

ప్రస్తుతం హిందీలోనే ఎక్కువ ఫోకస్ చేసినట్టు కనిపించినా.. సౌత్ ను వదిలేయలేదు అనేందుకు ఈ ప్రాజెక్ట్ ఓ ఎగ్జాంపుల్ అంటోంది.రష్మిక మందన్నా ఉంటే సినిమాలకు మంచి క్రేజ్ వస్తోంది. ఓ రకంగా తనకు ఇంత క్రేజ్ రావడానికి కారణం పుష్ప అనే చెప్పాలి.

ఈ మూవీని తను వాడుకున్నంతగా ఇంకెవరూ వాడుకోలేదు. ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా తను అటెండ్ అవుతుంది. ఎన్నిసార్లు అడిగినా పుష్పలోని స్టెప్పులు వేస్తూ ఆకట్టుకుంటోంది. ఓ రకంగా తనను దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు ఎక్కువగా పరిచయం చేసింది ఈ సినిమాతో పాటు వరుసగా జరిగిన కొన్ని ఈవెంట్సే అంటే కాదనలేం.

ఆ స్థాయిలో దూసుకుపోయింది కాబట్టే అమ్మడు నేషనల్ క్రష్‌ అయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో మూడు సినిమాలు చేస్తోన్న తను తెలుగులో పుష్ప2తో పాటు విజయ్ సరసన వారసుడు మూవీ చేస్తోంది. లేటెస్ట్ గా కార్తీ హీరోగా నటించే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


కార్తీతో రష్మిక మందన్నా సుల్తాన్ సినిమాలో నటించింది. ఈ మూవీతోనే తను కోలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వడం విశేషం. బట్ సుల్తాన్ ఆశించినంతగా ఆకట్టుకోలేదు. బట్ రీసెంట్ గా విజయ్ సరసన అవకాశం రావడంతో ఎగిరిగంతేసింది. ఇక ఇప్పుడు మరోసారి కార్తీతో నటించే ఛాన్స్ రావడంతో ఓకే చెప్పింది. ప్రస్తుతం కార్తీ నటించిన పొన్నియన్ సెల్వన్1 ఈ శుక్రవారం వస్తోంది.

తను సోలోగా నటించిన సర్దార్ అనే సినిమా దీపావళికి విడుదలవుతుంది. ఆ తర్వాతే కొత్త మూవీ స్టార్ట్ అవుతుంది. ఈ చిత్ర కథ నచ్చడంతో రష్మిక కూడా మరోసారి కార్తీతో రొమాన్స్ చేసేందుకు ఓకే చెప్పింది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అఫీషియల్ డీటెయిల్స్ త్వరలోనే అనౌన్స్ కాబోతున్నాయి. ఏదేమైనా మంచి ఆఫర్, మంచి రెమ్యూనరేషన్ ఉంటే వెంటనే డేట్స్ ఇచ్చేస్తోంది రష్మిక.

, , , , , , , , , ,