ad

చిన్న సినిమాతో వచ్చి పెద్ద హీరోలకు ఫస్ట్ ఆప్షన్ గా మారి టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ అనే ట్యాగ్ కూడా గెలుచుకున్న బ్యూటీ రష్మిక మందన్నా.. పుష్ప తర్వాత ఓ దశలో ఏకంగా నేషనల్ క్రష్ కూడా అనిపించుకుందీ సుందరి. విజయ్ దేవరకొండతో ఎఫైర్ కు సంబంధించిన రూమర్స్ కూడా అమ్మడి కెరీర్ కు చాలా ప్లస్ అయ్యాయి. ఆ మేటర్ వల్లే సోషల్ మీడియాలో క్రేజ్ పెరిగింది అనేది వాస్తవం. దీనికి తోడు తను నటించిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించడంతో లక్కీ హీరోయిన్ అన్న టాక్ కూడా వచ్చేసింది. దీంతో స్టార్ హీరోలు కూడా రష్మిక ను తీసుకోవాలనుకుంటున్నారు. ఆ క్రమంలో చేసిన పుష్ప చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అవడం.. ఆ క్రేజ్ తో బాలీవుడ్ లో కూడా మంచి ఆఫర్స్ వచ్చాయి. ఈ ఆఫర్స్ తోనే ఇప్పుడు అమ్మడు రెండు పడవలపై తీన్మార్ వేసేలా చేస్తోంది.

రష్మికకు ఉన్న డిమాండ్ గురించి అందరికీ తెలుసు ఇప్పుడు. అయినా తను తెలుగులో భారీ సినిమాలేం చేయడం లేదు. స్టార్ హీరో అంటే పుష్ప ది రైజ్ లోనే నటిస్తోంది. దీంతో పాటు హను రాఘవపూడి డైరెక్షన్ లో దుల్కర్ సాల్మన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న సీతా రామమ్ అనే సినిమాలో ఓ కీలకమైన పాత్ర చేస్తోంది. తను హీరోయిన్ కాదు. మరోవైపు విజయ్ సరసన వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెలుగు, తమిళ్ బై లింగ్వుల్ గా వస్తోన్న చిత్రంలో నటిస్తోంది. అంటే ప్రస్తుతం తను సౌత్ లో మూడు సినిమాల్లో నటిస్తూ ఇక్కడ ఓ తీన్మార్ వేస్తోందన్నమాట.

ఇక హిందీలోనూ మరో మూడు ప్రాజెక్ట్స్ లో నటిస్తూ అక్కడో తీన్మార్ వేస్తోంది రష్మిక. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా వస్తోన్న స్పై థ్రిల్లర్ మిషన్ మజ్ను అనే చిత్రంలో తనే మెయిన్ హీరోయిన్ గా నటించింది. రీసెంట్ గా ఈ మూవీ పూర్తయింది కూడా. తన ఫస్ట్ బాలీవుడ్ డెబ్యూగా ఈ చిత్రాన్ని చెప్పొచ్చు. అలాగే అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న గూడ్ బైలో నటిస్తోంది. దీంతో లేటెస్ట్ గా మరో బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ కు సైన్ చేసింది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలు త్వరలోనే వస్తాయి. మొత్తంగా సౌత్ లో మూడు, బాలీవుడ్ లో మూడు సినిమాలతో అమ్మడు ఆరుగాలం శ్రమిస్తోందన్నమాట.

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,