గోపురం స్టూడియోస్‌ పతాకం ఫుల్‌జోష్‌లో ఉంది. 2022 సంవత్సరంలో గోపురం స్టూడియోస్‌ వారు వరుసగా తెలుగులో, తమిళంలో సినిమాలు తీస్తూ సూపర్‌స్పీడ్‌లో ఉన్నారు.

ఏ.ఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహించిన ‘‘నాన్న’’, లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ‘‘నగరం’’ సినిమాలతో పాటు అనేక సినిమాల్లో బాలనటునిగా నటించిన హమరేశ్‌ ‘‘రంగోలి’’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు.

వాలీ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నిర్మాతలు కె.బాబురెడ్డి, జి సతీష్‌కుమార్‌లు.

‘‘రంగోలి’’ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ దర్శకులు లోకేశ్‌ కనగరాజ్, వెంకట్‌ ప్రభు, హీరోలు అరుణ్‌విజయ్, అధర్వ, నవీన్‌చంద్ర, కార్తీక్‌రాజ్, జి.వి ప్రకాశ్‌లు

హీరోయిన్‌ వాణీబోజన్‌లతో పాటు పలువురు చిత్ర ప్రముఖులు తమ సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు. ‘రంగోలి’టీమ్‌కి బెస్ట్‌ విశెష్‌ని అందచేశారు.

, , , , , , , , , , , , , , , , , , ,