ఉప్పెనతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు వైష్ణవ్ తేజ్. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఉప్పెన తర్వాత చేసిన కొండపొలం పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. నటుడుగా ఓ మెట్టు ఎక్కేందుకు ఉపయోగపడింది. ఇప్పుడు గిరీశయ్య డైరెక్షన్ లో రంగరంగ వైభవంగా అనే సినిమాతో వస్తున్నాడు. యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ విషయంలో పెద్దగా హడావిడీ లేకుండా రావడం విశేషం. గిరీశయ్య.. అర్జున్ రెడ్డి సినిమాను తమిళ్ లో తీసి అక్కడా మంచి విజయం అందుకున్నాడు. అతని తొలి సినిమాకు భిన్నంగా ఈ చిత్రం కనిపిస్తోంది.


పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా కనిపిస్తోంది రంగరంగ వైభవంగా ట్రైలర్. కాస్త నిన్నే పెళ్లాడతా ఫ్లేవర్ ఉన్నా.. ఈ కాలపు కథలా కనిపిస్తోంది. చిన్నప్పుడే ఓ గొడవతో విడిపోయిన పక్క పక్క ఇంటి పిల్లలే పెద్దయ్యాక వైష్ణవ్, కేతిక అవుతారు. ఆ చిన్నప్పటి పగ పెద్దయ్యే వరకూ ఉంటుంది. కానీ యవ్వనంలోకి వచ్చిన తర్వాత ప్రేమ కామన్ కదా.. అలా ప్రేమలో పడ్డ వీరి ఫ్యామిలీ లైఫ్ లో కొత్త సమస్యలు వస్తాయి. ఆ తర్వాతంతా ఎమోషనల్ గా కనిపించింది ట్రైలర్.
ట్రైలర్ మొత్తం అన్ని వర్గాల ప్రేక్షకులను టార్గెట్ చేసినట్టుగా కట్ చేశారు. లవ్, ఎంటర్టైన్మెంట్, యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా… ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ పర్ఫెక్ట్ గా సూట్ అయితే వైష్ణవ్ కు మరో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనుకోవచ్చు. సెప్టెంబర్ 2న ఈ చిత్రం విడుదల కాబోతోంది. నిజానికి రెండు నెలల క్రితమే రావాల్సింది. కానీ అనుకోకుండా ఇప్పటికే రెండుసార్లు పోస్ట్ పోన్ అయింది. బట్ ఈ సారి గ్యారెంటీగా రిలీజ్ అవుతుంది. మొత్తంగా వైష్ణవ్ తేజ్ ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వస్తున్నాడనే మంచి ఇంప్రెషన్ ను ఈ ట్రైలర్ వేసింది. ఇక సినిమా కూడా అలాగే ఉంటే సెప్టెంబర్ కూడా ఆగస్ట్ లా గ్రాండ్ గా స్టార్ట్ అవుతుంది.

, ,