పాకిస్తాన్ ఈ పేరు వింటేనే మనవాళ్ళు వాళ్ళేదో శత్రువులు అన్నట్టుగా చూస్తారు. క్రికెట్ లో ఐతే అన్ని దేశాలతో ఓడినా ఫర్వాలేదు పాక్ తో ఓడితే మాత్రం ఊరుకోరు. అఫ్కోర్స్ అటు వాళ్ళూ అలాగే ఉంటారు.

అలాంటి దేశం లో వెళ్లి నటిస్తా అని చెప్పిన రణ్ బీర్ కపూర్ మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నిజానికి పాక్ లో మన ఇండియన్ మూవీ ఆర్టిస్టులకు చాల మంది డై హార్డ్ ఫాన్స్ ఉన్నారు.

అమితాబ్ నుంచి మాధురి దీక్షిత్ వరకూ .. ఇప్పుడున్న యంగ్ స్టర్స్ అంటే కూడా అభిమానిస్తారు. ఇక మన తెలుగు మూవీ బాహుబలిని కూడా మెచ్చుకున్నారు. అయినా రణ్ బీర్ మాటలను జనం ఈజీ గా తీసుకోవడం లేదు.


ఐతే రణ్ బీర్ ఒక మాట అన్నాడు.. నేనిప్పుడు సౌదీ లో ఉన్నా .. ఇక్కడ కూడా నటించాలని ఉంది.. అవకాశం వస్తే పాకిస్తాన్ లో కూడా యాక్ట్ చేస్తా అన్నాడు. ఈ వ్యాఖ్యలపై నెటిజెన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు అతన్ని సపోర్ట్ చేస్తే కొందరు వ్యతిరేకిస్తున్నారు.

నిజానికి కళకు ఎల్లలు ఏమున్నాయి. అలా ఉంటె మన సినిమాలు అన్ని దేశాల్లో ఆకట్టుకుంటాయా..? వేరే దేశాల సినిమాలు మనం చోస్తామా..?ఇదే రణ్ బీర్ కు ఏ హాలీవుడ్ నుంచో ఆఫర్ వస్తే ఇలాగే అంటారా..?
ఏదేమైనా అతను అన్నాడు కళారంగం కోణంలోనే వాటిని వక్రీకరించడం అంటే వక్ర బుద్ధిని చూపినట్టే అనేది చాలామంది చెబుతోన్న మాట.

, , , , , , , , , , ,