ఆర్ఆర్ఆర్ వంటి ఎపిక్ హిట్ త‌ర్వ‌త విడుద‌లైన ఆచార్య అనుకున్న రిజ‌ల్ట్ఇవ్వ‌క‌పోయినా.. శంక‌ర్ డైరెక్ష‌న్ లో సినిమాతో స‌త్తా చాటొచ్చు అనుకున్నాడు రామ్ చ‌ర‌ణ్. శంక‌ర్- రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ దేశ‌వ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకుంది కూడా. బ‌ట్.. అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ వెన‌క్కి త‌గ్గాల్సి వ‌చ్చింది. అందుకు కార‌ణం శంక‌ర్ భార‌తీయుడు2ను పూర్తి చేయాల్సిందే అని కోర్ట్ నుంచి ఆర్డ‌ర్స్ రావ‌డ‌మే. అప్పుడెప్పుడో ప్రారంభం అయిన భార‌తీయుడు2 కొన్ని అన‌కోని కార‌ణాల‌తో ఆగిపోయింది. ఓ ద‌శ‌లో శంక‌ర్ వ‌ల్ల కోర్ట్ వ‌ర‌కూ వెళ్లింది. చివ‌రికి కోర్ట్ నిర్మాత‌ల‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో ముందు త‌మ‌సినిమానే పూర్తి చేయాల‌ని నిర్మాత‌లు ప‌ట్టుప‌ట్టారు. కానీ అప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్ సినిమా ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుని ఉంది. ఇది పూర్తి చేయ‌డానికి భార‌తీయుడు2 నిర్మాత‌లు ఒప్పుకోలేదు.

అనివార్యంగా ఓ ఒప్పందం చేసుకున్నారు.ఒక షెడ్యూల్ క‌మ‌ల్ హాస‌న్ సినిమా. మ‌రో షెడ్యూల్ రామ్ చ‌ర‌ణ్ సినిమా అనేదే ఆ అగ్రిమెంట్. అందుకు అనుగుణంగానే కొన్నాళ్లుగా ఈ రెండు సినిమాల చిత్రీక‌ర‌ణ మొద‌లైంది. రీసెంట్ గా భార‌తీయుడు2కు సంబంధించి ఓ కీల‌క‌మైన షెడ్యూల్ ఫినిష్ అయింది. ఇక ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ వంతు. ఈ పార్ట్ కోసం ఎంటైర్ టీమ్ రాజ‌మండ్రి చేరుకుంది. ప్ర‌స్తుతం శంక‌ర్ – చ‌ర‌ణ్ సినిమా షూటింగ్ రాజ‌మహేంద్ర‌వ‌రంలో జ‌ర‌గ‌బోతోంది.ఇక ఈ చిత్రంలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న కియారా అద్వానీ హీరోయిన్ గా న‌టిస్తోంది. సునిల్, ఎస్జే సూర్య‌, అంజ‌లి, జ‌య‌రాం, శ్రీకాంత్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. చ‌ర‌ణ్ రెండు భిన్న‌మైన పాత్ర‌లు, గెట‌ప్స్ లో క‌నిపించ‌బోతున్నాడు. అయితే అత‌ను క‌లెక్ట‌ర్ గా న‌టించే పాత్ర సినిమాకు కీల‌కం అని చెబుతున్నారు. మొత్తంగా విడ‌త‌ల వారీగా సాగుతోన్న ఈ రెండు సినిమాలు ద‌ర్శ‌కుడుగా శంక‌ర్ కు కెరీర్ లోనే బిగ్గెస్ట్ స‌వాల్ గా మారాయి.

, , , , , ,