మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ ప్రపంచ వ్యాప్తంగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ కాకుండానే రామ్ చరణ్ గ్రేట్ డైరెక్టర్ శంకర్ తో పాన్ ఇండియా మూవీని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీతో పాటు చరణ్ గౌతమ్ తిన్ననూరితో కూడా ఓ సినిమా చేయనున్నాడు.
అయితే.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ రెండు సినిమాలతో పాటు రంగస్థలం డైరెక్టర్ సుకుమార్ తో కూడా చరణ్ ఓ సినిమా చేయనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ వార్తలు నిజమేనా.? కాదా..? అనేది ఆసక్తిగా మారింది. ఇప్పుడు ఆ వార్తలు నిజమే అని రాజమౌళి కన్ ఫర్మ్ చేశారు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ లో భాగంగా బాలీవుడ్ మీడియాకు ఇంటర్ వ్యూలు ఇస్తూ.. ఈ విషయాన్ని బయటపెట్టాడు రాజమౌళి. త్వరలోనే సుకుమార్, రామ్ చరణ్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారని చెప్పారు.
అంతే కాకుండా.. ఆ సినిమాలో ఓపెనింగ్ సీన్ కూడా తనకు తెలుసని రాజమౌళి బయటపెట్టాడు. తను చూసిన, తను విన్న బెస్ట్ ఓపెనింగ్ సీన్స్ లో ఒకటిగా అది నిలిచిపోతుందని చెప్పాడు జక్కన్న. రంగస్థలం కాంబో రిపీట్ కానుందని.. అందులో ఓపెనిగ్ సీన్ అదిరిపోతుంది అంటూ హింట్ ఇవ్వడంతో ఆ క్రేజీ ప్రాజెక్ట్ పై మరింత క్యూరియాసిటీ పెరగింది. అయితే.. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.