Advertisement
రెండు డేట్లు లాక్ చేసి షాక్ ఇచ్చిన రాజ‌మౌళి
Latest Movies Tollywood

రెండు డేట్లు లాక్ చేసి షాక్ ఇచ్చిన రాజ‌మౌళి

Advertisement

ఆర్ఆర్ఆర్… సినిమా ఇప్ప‌టికే చాలా సార్లు వాయిదా ప‌డింది. అందుచేత ఓ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి… ఆ డేట్ కి రావ‌డం కుద‌ర‌క‌పోతే మ‌రో డేట్ అనౌన్స్ చేయ‌డం ఎందుకు అనుకున్నాడో ఏమో కానీ… ఇప్పుడు రెండు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసి అంద‌రికీ షాక్ ఇచ్చాడ‌ని చెప్ప‌చ్చు. ఇంత‌కీ ఆ రెండు రిలీజ్ డేట్స్ ఎప్పుడంటే… కరోనా పరిస్థితులన్నీ సద్దుమణిగి, దేశవ్యాప్తంగా థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకుంటే మార్చి 18కి సినిమాను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు రాజమౌళి ప్రకటించారు.

ఒకవేళ ఆ తేదీకి దేశవ్యాప్తంగా పరిస్థితులు అనుకూలంగా లేకపోతే.. ఏప్రిల్ 28కి సినిమా థియేటర్లలోకి వస్తుందని కూడా అనౌన్స్ చేశాడు. ఇలా ఒకేసారి రెండు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసి కొత్త సంప్ర‌దాయానికి శ్రీకారం చుట్టారు. సంక్రాంతికి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 7న ఆర్ఆర్ఆర్ విడుద‌ల చేయాల‌నుకున్న‌ప్పుడు సంక్రాంతి సినిమాలు వాయిదా వేసుకోవాల్సివ‌చ్చింది. అప్పుడు రాజ‌మౌళి పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అలాంటి విమ‌ర్శ‌లు రాకుండా ఉండేందుకే ఇలా రెండు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశాడ‌ట జ‌క్క‌న్న‌. ఇంత‌కీ… ఈ రెండింటిలో ఏ డేట్ లో ఆర్ఆర్ఆర్ వ‌స్తుందో చూడాలి.

Image

Advertisement