Advertisement
రాజమౌళి వచ్చింది అల్లు అర్జున్ కోసం కాదు..?
Latest Movies Tollywood

రాజమౌళి వచ్చింది అల్లు అర్జున్ కోసం కాదు..?

Advertisement
అవును.. రాజమౌళి ఏం చేసినా ఓ స్ట్రాటజీ ఉంటుంది. ప్రణాళిక ప్రకారమే.. ఒక్కో మాటనూ మాట్లాడతాడు. ఆ విషయం పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరోసారి ప్రూవ్ అయింది. నిజానికి రాజమౌళి ప్లానింగ్ లో పుష్ప ప్రీ రిలీజ్ ఫంక్షన్ లేదు. సడెన్ గా ఆయన సీన్ లోకి వచ్చాడు. లేదంటే అంత పెద్ద దర్శకుడికి ఒక్క కటౌట్ కానీ.. ఏవి లాంటి ప్రత్యేకమైన గౌరవాలు లేకుండా ఉంటాయి. మరి అయినా ఎందుకు వచ్చాడు అంటారా.. సింపుల్.. అతనే చెప్పినట్టు తన బెస్ట్ ఫ్రెండ్ సుకుమార్ కోసమే. యస్.. రాజమౌళి ఈ ఫంక్షన్ కు కేవలం సుకుమార కోసమే వచ్చాడు. సుకుమార్ ఫైనల్ మిక్సింగ్ కోసం ముంబైలో ఉన్నాడు. ఆయన లేని లోటు కనిపించకూడదని.. సుకుమారే రాజమౌళిని ఈ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా అటెండ్ కావాలని కోరాడట. అతనితో పాటు కొరటాల శివను కూడా. సుకుమార్ మాట కాదనలేకే రాజమౌళి కూడా వచ్చాడు అనేది వాస్తవం అంటున్నారు.
ఇక ఈ ఫంక్షన్ లో రాజమౌళి మాట్లాడింది కూడా పూర్తిగా సుకుమార్ గురించే. ఈ సినిమా హిట్ కావడం తెలుగు సినిమా పరిశ్రమకు అవసరం అన్నట్టుగానే చెప్పాడు. అదేటైమ్ లో దర్శకుడు చివరి మూమెంట్ వరకూ అంత హార్డ్ వర్క్ చేస్తుంటే హీరోగా ఉన్న అల్లు అర్జున్ కనీసం ప్రమోషన్స్ కూడా చేయడం లేదనే అర్థం వచ్చేలా ఇన్ డైరెక్ట్ గా సెటైర్ కూడా వేశాడు. ముంబైలో కూడా పుష్ప కోసం చూస్తున్నారనీ.. కానీ మీరు ప్రమోషన్ చేయాల్సిందేనని ఖచ్చితంగా చెప్పాడు. మరో విషయం ఏంటంటే.. రాజమౌళి రాబోయే రోజుల్లో అల్లు అర్జున్ తో సినిమాలు చేస్తానని చెప్పలేదు. అతని నటనా కౌశలం గురించి మాట్లాడలేదు. కాకపోతే డెడికేషన్ గురించి కాస్త పొగిడాడు. మొత్తంగా రాజమౌళి కేవలం తన బెస్ట్ ఫ్రెండ్ సుకుమార్ కోసమే ఈ ఫంక్షన్ కు వచ్చాడు.. కానీ అల్లు అర్జున్ కోసం కాదనే మాటలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.

Advertisement

Post Comment