Advertisement
రాధేశ్యామ్.. ఇక‌నైనా ప‌రుగులు పెడుతుందా..?
Latest Movies Tollywood

రాధేశ్యామ్.. ఇక‌నైనా ప‌రుగులు పెడుతుందా..?

Advertisement

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళిల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం ఆర్ఆర్ఆర్. ఇప్పుడు సినీ అభిమానుల అంద‌రి నోట ఒక‌టే మాట అదే ఆర్ఆర్ఆర్. జ‌న‌వ‌రి 7న సంక్రాంతి కానుక‌గా ఆర్ఆర్ఆర్ ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. దీంతో ప్ర‌మోష‌న్స్ లో స్పీడు పెంచి ఇంకా చెప్పాలంటే.. రాజ‌మౌళి.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. ఈ ఇద్ద‌రు హీరోలును వెంట‌పెట్టుకుని కాళ్ల‌కు చ‌క్రాలు క‌ట్టుకున్న‌ట్టుగా ప‌రుగులు తీస్తున్నారు. ప్ర‌మోష‌న్స్ లో దూసుకెళుతున్నారు.

అయితే.. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్. ఈ పాన్ ఇండియా మూవీ నుంచి మాత్రం ఎలాంటి అప్ డేట్ లు రావ‌డం లేదు. ప్ర‌మోష‌న్స్ లో బాగా వెన‌క‌బ‌డింది. రాధేశ్యామ్ జ‌న‌వ‌రి 14న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్. అంటే.. క‌రెక్ట్ గా నెల రోజుల టైమ్ మాత్ర‌మే ఉంది. స‌రైన టీజ‌ర్ రిలీజ్ కాలేదు. స‌మ‌యం లేదు. కాబ‌ట్టి ట్రైల‌ర్ రిలీజ్ చేయాలి అనుకుంటున్నార‌ని స‌మాచారం. రెండున్న‌ర నిమిషాల ఉండేలా ట్రైల‌ర్ క‌ట్ చేశార‌ని తెలిసింది.

త్వ‌ర‌లోనే రాధేశ్యామ్ ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌నున్నారు. దీనికి సంబంధించి రెండు రోజుల్లో డేట్ ని ప్ర‌క‌టించ‌నున్నార‌ని టాక్ వినిపిస్తోంది. అయితే.. రాధేశ్యామ్ ప‌బ్లిసిటీ చేయ‌క‌పోవ‌డం పై ప్ర‌భాస్ అభిమానులు చాలా కోపంగా ఉన్నారు. ప్ర‌భాస్ సినిమా కాబ‌ట్టి రిలీజ్ కి ముందు ప్ర‌మోష‌న్స్ చేస్తే స‌రిపోతుంది అనుకుంటున్నారేమో నిర్మాణ సంస్థ‌. అయితే.. ప్ర‌భాస్ వ‌ల‌న జ‌నాలు వ‌స్తారు. సినిమాకి విజ‌యాన్ని అందిస్తారు కానీ.. బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వాలంటే మాత్రం ఖ‌చ్చితంగా ప‌బ్లిసిటీ బాగా చేయాలి. ఇప్పుడు అంద‌రి క‌ళ్లు రాధేశ్యామ్ ట్రైల‌ర్ మీదే ఉంది. మ‌రి.. ట్రైల‌ర్ రిలీజ్ అయిన త‌ర్వాత నుంచైనా రాధేశ్యామ్ ప్ర‌మోష‌న్స్ లో స్పీడు పెంచుతారేమో చూడాలి.

Advertisement