ad

పి.వి.న‌ర‌సింహారావుకి సంబంధించిన విశేషాల‌ను తెలియ‌జేస్తూ విన‌య్ సీతాప‌తి రాసిన పుస్త‌కం ‘హాఫ్ ల‌య‌న్‌’. జాతీయ అవార్డ్ గ్రహీత అయిన దర్శకుడు ప్రకాష్ ఝా ఈ సిరీస్‌ను తెర‌కెక్కించ‌నున్నారు. 2023లో ‘హాఫ్ ల‌య‌న్‌’ తెలుగు, హిందీ, త‌మిళంలో విడుద‌ల‌వుతుంది. ఆహాలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ అనౌన్స్ మెంట్ సందర్భంగా

ద‌ర్శ‌కుడు ప్ర‌కాశ్ ఝా మాట్లాడుతూ ‘‘రియల్ లైఫ్ స్టోరీస్, సబ్జెక్ట్స్‌పై వర్క్ చేయడం ఎప్పుడూ చాలా కొత్తగా, ఎగ్జ‌యిటింగ్‌గా అనిపిస్తుంది. ఆహా వంటి మాధ్య‌మంలో ఇలాంటి కాన్సెప్ట్స్ చేయ‌డం అనేది హ్యాపీగా ఉంది. ఇక అప్లాజ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇప్ప‌టికే కంటెంట్‌ను క్రియేటింగ్‌లో ఎస్టాబ్లిష్ అయ్యింది. అలాంటి సంస్థ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావ‌డం అనేది ఎగ్జ‌యిట్‌మెంట్‌ను మ‌రింత పెంచుతుంది. ఈరోజు దేశం ఇలా ముందుకు వెళుతుందంటే, అందుకు కార‌ణంగా ఉండి ఎంతో కీల‌క‌మైన పాత్ర‌లు పోషించిన వ్య‌క్తుల్లో ఒక‌రైన పి.వి.న‌ర‌సింహారావు. ఆయన గురించి సిరీస్ చేయ‌డం ఆనందంగా ఉంది. నేటి త‌రం ఆయ‌న నుంచి నేర్చుకోవాల్సిన విష‌యాలు ఎన్నో ఉన్నాయ‌నేది నా న‌మ్మ‌కం’’ అన్నారు

, , , , , , , , , , ,