Advertisement
“పుష్ప” నాన్ వెజ్ మీల్స్ – సునీల్
Latest Movies Tollywood

“పుష్ప” నాన్ వెజ్ మీల్స్ – సునీల్

Advertisement

అల వైకుంఠపురములో సినిమా పెళ్లి విందులాంటిది అయితే పుష్ప రిసెప్షన్ లో పెట్టే నాన్ వెజ్ మీల్స్ అని అన్నారు నటుడు సునీల్. పుష్ప సినిమాలో మంగళం శీనుగా విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు సునీల్. పుష్ప ప్రీరిలీజ్ లో పాల్గొన్న సునీల్ మాట్లాడుతూ…ఈ చిత్రంలో తనను కొత్త నటుడిలా చూస్తేనే విలనీని ఎంజాయ్ చేస్తారన్నారు. మిగతా భాషల ప్రేక్షకులకు తాను కొత్త నటుడినే కాబట్టి సమస్యలేదన్నారు.

300 సినిమాల్లో కమెడియన్ గా, 10 సినిమాల్లో హీరోగా నటించిన తర్వాత గానీ తనకు విలన్ గా చేసే అవకాశం రాలేదని సునీల్ చెప్పారు. పుష్ప సినిమా చూసి బయటకొచ్చాక ఆ సినిమాలోని అట్మాస్పియర్ ను చాలా రోజులు ప్రేక్షకులు మర్చిపోలేరని చెప్పారు సునీల్.

Advertisement