Advertisement
బన్నీ కెరీర్‌లో ఎప్ప‌టికీ గుర్తుండిపోయే సినిమా “పుష్ప‌”
Latest Movies Tollywood

బన్నీ కెరీర్‌లో ఎప్ప‌టికీ గుర్తుండిపోయే సినిమా “పుష్ప‌”

Advertisement

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబినేష‌న్లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన చిత్రం పుష్ప‌. ఈ నెల 17న పుష్ప చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాతలతో పాటు మైత్రీ మూవీమేకర్స్ సీఇవో చిరంజీవి చెర్రీ మీడియాతో మాట్లాడుతూ… పాన్ ఇండియన్ మూవీ చేయాలనే మా కల ఈ సినిమాతో తీరనుంది. దర్శకుడు సుకుమార్ చెప్పిన పుష్ప కథ వినగానే అన్ని భాషల వారికి చేరువ అయ్యే యూనివర్శల్ కథ అవుతుందనిపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో కలిపి మూడువేల థియేటర్స్‌లో సినిమాను విడుదల చేయబోతున్నాం అని చెప్పారు.

ఇక ఈ సినిమా గురించి చెబుతూ.. అరుదైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. ఎర్రచందనం అక్రమరవాణాతో పాటు మానవీయ విలువలు, భావోద్వేగాల కలబోతగా చక్కటి అనుభూతిని పంచుతుంది. రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నిడివితో ప్రారంభం నుంచి ముగింపు వరకు ఉత్కంఠభరితంగా.. ఆసక్తికరంగా సాగుతుంది. సినిమాలో ప్రతి పాత్ర ఎంతో అద్భుతంగా వుంటుంది. ముఖ్యంగా హీరో అల్లు అర్జున్ నటన అద్భుతం.. స్క్రీన్‌ప్లే రేసీగా ఉంటుంది. మాస్ కథకు క్లాస్ హంగులను మేళవిస్తూ అన్ని వర్గాల్ని అలరించేలా దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను తీర్చిదిద్దారు. దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన పాటల్ని స్వరపరిచారు. ఈ ఆల్బమ్‌లోని అన్ని పాటలు సూపర్‌హిట్ అవ్వడం ఆనందంగా ఉంది అన్నారు.

సినిమా చిత్రీకరణలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. క్లిష్టమైన పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఎవరూ వెళ్లని అరుదైన లొకేషన్స్‌లో షూటింగ్ చేశాం.ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందనుకుంటున్నాం. ట్రైలర్‌కు చక్కటి స్పందన లభిస్తున్నది. అఖండ విజయం మాలోనూ ఉత్సాహాన్ని నింపింది. ఆ విజయపరంపరను మా చిత్రం కొనసాగిస్తుందనే నమ్మకముంది. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కొత్త పంథాలో అల్లు అర్జున్ కనిపిస్తారు. చిత్తూరు యాసలో ఆయన చెప్పిన సంభాషణలు మెప్పిస్తాయి. బన్నీ కెరీర్‌లో ఎప్ప‌టికీ గుర్తుండిపోయే సినిమా అవుతుందని చెప్పారు చిత్ర‌ నిర్మాత‌లు.

Advertisement