Advertisement
“పుష్ప” కష్టం నాలుగు సినిమాలతో సమానం – అల్లు అర్జున్
Latest Movies Tollywood

“పుష్ప” కష్టం నాలుగు సినిమాలతో సమానం – అల్లు అర్జున్

Advertisement

పుష్ప సినిమాకు పడిన కష్టం నాలుగు సినిమాలతో సమానని అన్నారు అల్లు అర్జున్. ఆయన హీరోగా నటించిన పుష్ప ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడారు అల్లు అర్జున్. ఈ వేడుకలో దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ లేకపోవడం లోటుగా భావిస్తున్నట్లు చెప్పారు. సుకుమార్ ,దేవితో తన ప్రయాణం రెండు దశాబ్దాలు దాటిందన్న అల్లు అర్జున్…ఈ సినిమాకు దేవి ఇచ్చిన మ్యూజిక్ నటుడిగా తనకు ఎనర్జీ ఇచ్చిందన్నారు.

ఇక సుకుమార్ నేను వేరు కాదన్న అల్లు అర్జున్…పుష్పకు ఏ క్రెడిట్ వచ్చినా అది మా ఇద్దరిదీ అన్నారు. రశ్మిక మందన్నకు నాయికగా ఇంకా బెస్ట్ ఫ్యూచర్ ఉందని అన్నారీ స్టైలిష్ స్టార్. మైత్రీ మూవీ మేకర్స్ కు సినిమా మీదున్న ప్యాషన్ వల్లే పుష్ప ఇంత గ్రాండ్ గా మీ ముందుకొస్తోందని చెప్పారు అల్లు అర్జున్. సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ క్యారెక్టర్స్ అదిరిపోతాయన్న ఈ స్టార్….స్పెషల్ సాంగ్ చేసిన సమంతకు థాంక్స్ చెప్పారు.

Advertisement