ad

 

 

 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప‌. ఆర్య‌, ఆర్య 2 చిత్రాల త‌ర్వాత బ‌న్నీ, సుక్కు క‌లిసి చేసిన సినిమా కావ‌డంతో అటు అభిమానుల్లోను ఇటు ఇండ‌స్ట్రీలోను పుష్ప సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో డిసెంబ‌ర్ 17న పుష్ప ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే.. ఈ సినిమా ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది. ఎలా అంటారా..? యూఏఈ ఓవ‌ర్ సీస్ సెన్సార్ బోర్డ్ లో స‌భ్యుడిగా ఉన్న ఉమైర్ సంధు ఈ చిత్రాన్ని చూసి త‌న అనుభ‌వాన్ని ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేశాడు.

ఇంత‌కీ పుష్ప గురించి ఏం చెప్పాడంటే.. పుష్ప ఫ‌స్టాఫ్ టెర్రిఫిక్ గా ఉంది. బ‌న్నీ, ర‌ష్మిక కెమిస్ట్రీ అదిరింది. వాటే ఏ ప‌ర్ ఫార్మెన్స్ అనిపించేలా ఉంది. పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా ర‌ష్మిక అద్భుతంగా న‌టించింది. ఇక సుకుమార్ స్టోరీ, స్ర్కీన్ ప్లే, డైరెక్ష‌న్ అద్భుతం. టాలీవుడ్ లో ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి సినిమా రాలేదు. అత్యుత్త‌మ చిత్రాల్లో ఒక‌టిగా నిలుస్తుంది. అల్లు అర్జున్ కెరీర్ లో బెస్ట్ ప‌ర్ ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆయ‌న న‌ట‌న‌కు నేష‌న‌ల్ అవార్డ్ రావ‌డం ఖాయం అన్నారు.

ఆయ‌న అన్ని విధాలుగా ప్ర‌త్యేకంగా నిలిచారు. తెలుగులో ఈ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డం ఖాయం. హిందీలో ఎంత వ‌ర‌కు మెప్పిస్తుందో చూడాలి. అయితే.. ఈ సినిమాకి రేటింగ్ 5 కి 4 అంటూ ఉమైర్ సంధు ప్ర‌క‌టించారు. దీంతో పుష్ప పై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. మ‌రి.. పుష్ప బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఏరేంజ్ స‌క్స‌స్ సాధిస్తుందో చూడాలి.

, , , , , , , , , , , ,