వెర్సటైల్ హీరో సత్యదేవ్‌, కన్నడ స్టార్ డాలీ ధనంజయ కలిసి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఒక కొత్త చిత్రం చేస్తున్నారు. నిర్మాతలు బాల సుందరం, దినేష్ సుందరం ఓల్డ్ టౌన్ పిక్చర్స్ ప్రొడక్షన్ నంబర్ 1గా  క్రిమినల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సత్యదేవ్, డాలీ ధనంజయ ఇద్దరికీ ఇది 26వ ప్రాజెక్ట్.తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ ని ప్రకటించారు నిర్మాతలు. ప్రియా భవానీ శంకర్  ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌గా నటించనుంది. ఇది ప్రియా భవానీ శంకర్ తొలి తెలుగు చిత్రం కానుంది. ఇటీవలి బ్లాక్‌బస్టర్ గా నిలిచిన  తిరుతో సహా మరికొన్ని తమిళ చిత్రాలలో ఆమె నటించారు.

అనౌన్స్ మెంట్ పోస్టర్‌పై ఉన్న వస్తువులను పరిశీలిస్తే- కుట్టు కొలిచే టేప్, కట్టర్ కనిపిస్తున్నాయి. ఇందులో ప్రియా ఫ్యాషన్ డిజైనర్‌గా కనిపించనుంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూడా వుండబోతున్నారు.ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. చరణ్ రాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మణికంఠన్ కృష్ణమాచారి సినిమాటోగ్రాఫర్. మీరాఖ్ డైలాగ్స్ రాస్తుండగా, అనిల్ క్రిష్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.సత్యదేవ్‌, ధనంజయ వైవిధ్యమైన పాత్రలతో అలరించి తమకంటూ ఒక మార్క్ ని సంపాదించుకున్నారు. వీరిద్దరూ కలసి చేస్తున్న ఈ సినిమాపై సహజంగానే ప్రేక్షకుల్లో క్యూరీయాసిటీ నెలకొంది.ఈ చిత్రానికి సంబంధించిన ఇతర ప్రముఖ నటీనటులను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.

, , , ,