కృష్ణంరాజు మరణం ప్రభాస్ ను బాగా కుంగదీసింది. అంత పెద్ద స్టార్ అయి ఉండీ ఎమోషన్స్ ను ఏ మాత్రం దాచుకోలేకపోయాడు. చిన్న పిల్లాడిలా ఏడ్చాడు. అంటే పెదనాన్నపై అతనికి ఎంత ప్రేమ ఉందో అర్థమౌతోంది కదా. ఇంకా ఆ ఇంటికి ఇక నుంచి పెద్ద దిక్కు ప్రభాసే. ప్రభాస్ కృష్ణంరాజుగారికి తలకొరివి పెట్టలేదు. తమ్ముడు ప్రమోద్ తో పెట్టించాడు. దీంతో ప్రభాస్ మళ్లీ త్వరలోనే షూటింగ్స్ లో జాయిన్ అవుతాడు అనుకున్నారు. బట్ ప్రభాస్ అందుకు సిద్ధంగా లేడిప్పుడు. తనకు కొంత టైమ్ కావాలని మేకర్స్ అందరికీ చెప్పాడట. దీంతో ఈ నెలాఖరులో మొదలు కావాల్సి ఉన్న సలార్ మూవీ షెడ్యూల్ ను ఆపేశారు. ఓ నెల తర్వాతే కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. అటు ప్రాజెక్ట్ కే విషయంలోనూ కొంత గ్యాప్ తీసుకోబోతున్నాడు.

ఈ మేరకు ఇప్పటికే ఆయాన ప్రొడక్షన్ హౌస్ లు షెడ్యూల్స్ ను ఆపేసుకుని ఇతర ఆర్టిస్టుల డేట్స్ ను రీ సెట్ చేసుకునే పనిలో పడ్డారు.నిజానికి ప్రభాస్ మరీ ఇంత డీలా అయిపోతాడని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే కృష్ణంరాజుగారిది హఠాన్మరణం కాదు. ఆయన చాలాకాలంగా బెడ్ కే పరిమితం అయ్యారు. పైగా నెల రోజుల నుంచి హాస్పిటల్ లోనే ఉంటున్నారు. అలాగని బాధపడొద్దు అని కాదు. తను పెద్ద వాడై ఉండీ అంత డల్ అయితే ఇంక ఫ్యామిలీ మరింత కృంగిపోతుంది కదా అని. పైగా కృష్ణంరాజుగారికి అందరూ అమ్మాయిలే. వారికి ధైర్యం చెప్పాలంటే ముందు తను ధైర్యంగా ఉండాలి. ఆ కారణంగా కూడా సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చి ఉంటాడు అనుకోవచ్చు. ఏదేమైనా ఈ బాధ నుంచి ఆ కుటుంబం వీలైనంత త్వరగా కోలుకోవాలని మనమూ కోరుకుందాం.

, , , ,