ad

కొన్ని కాంబినేషన్స్ పరిశ్రమకు సర్ ప్రైజ్ చేస్తే ఫ్యాన్స్ ను షాక్ కు గురిచేస్తాయి. అలాంటిదే ఈ కాంబినేషన్. ప్రస్తుతం ప్యాన్ ఇండియన్ స్టార్ గా.. ఆ మాటకొస్తే ప్యాన్ వరల్డ్ అని కూడా అంటూ.. దూసుకుపోతున్నాడు ప్రభాస్. అతని రేంజ్ టాలీవుడ్ ను ఎప్పుడో దాటిపోయింది. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులను అలరించే కథలతోనే రావాలి. మరి ఇలాంటి టైమ్ లో ప్రేమకథా చిత్రమ్ సీక్వెల్ లో ప్రభాస్ అనే వార్తలు రావడం ఆశ్చర్యం కాక మరేంటీ. మరి ఈ కథ వెనక ఉన్న కహానీ ఏంటో చూద్దాం..
తెలుగుతో పాటు దేశవ్యాప్తంగా ఓ కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసిన సినిమా ప్రేమకథా చిత్రమ్. అప్పటి వరకూ హారర్ మూవీ అంటే భయం మాత్రమే కనిపించింది. వికృతమైన మేకప్ లు, షాకింగ్ సీన్స్, కెమెరా విన్యాసాలు, చివర్లో ఓ రివెంజ్ స్టోరీ అంటూ రొటీన్ గా ఉందీ ట్రెండ్. ఆ ట్రెండ్ ను బ్రేక్ చేశాడు దర్శకుడు మారుతి. హారర్ కథలో అవుట్ అండ్ అవుట్ కామెడీని జోడించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. నిజానికి ఈ జానర్ ఇప్పటి వరకూ ప్రపంచంలో కూడా లేదనే చెప్పాలి. అందుకే ఈ ట్రెండ్ ను తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పరిశ్రమలూ ఫాలో అయ్యాయి. ఓ చిన్న ప్రేమకథకు కాసింత హారర్ ను జోడించి రొటీన్ ఫార్మాట్ లోనే కంటెంట్ కనిపించినా.. కథనం మాత్రం హిలేరియస్ గా వర్కవుట్ కావడంతో ఈ సినిమా సూపర్ హిట్ అనిపించుకుంది.
ఇక కొన్నాళ్లుగా ప్రభాస్ – మారుతి కాంబినేషన్ లో సినిమా వస్తుందనే రూమర్స్ వస్తున్నాయి. అయితే అవి రూమర్స్ కాదు.. నిజమే అనేలా ఉన్నాయి లేటెస్ట్ న్యూస్. ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ తో ప్రస్తుతం ఏ మాత్రం ఖాళీ లేకుండా షూటింగ్స్ చేస్తోన్న ప్రభాస్ ఓ చిన్న ఛేంజ్ ఓవర్ లా కనిపించే సినిమా కోసం చూస్తున్నాడట. ఈ టైమ్ లో మారుతి చెప్పిన ఓ హారర్ కామెడీ కథ ప్రభాస్ ను విపరీతంగా ఆకట్టుకుందంటున్నారు. అందుకే వెంటనే యస్ చెప్పాడట.
కేవలం రెండు నెలల్లోనే చిత్రీకరణ పూర్తి చేసేలా ఒప్పందం కూడా ఉందట. ఇందుకోసం హైదరాబాద్ లోనే ఓ భారీ సెట్ ను వేయబోతున్నారు. ఈ సెట్ లోనే సినిమా సగానికి పైగా షూటింగ్ జరుపుకుంటుందట. అందుకే ప్రభాస్ కూడా తక్కువ టైమ్ లోనే చిత్రీకరణ అవుతుందనే ఈ కథను ఒప్పుకున్నాడంటున్నారు. ఈ సెట్ కు సంబంధించిన వర్క్స్ సమ్మర్ లో స్టార్ట్ అవుతాయి. సెట్టింగ్ పూర్తి కాగానే.. షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ఈలోగా మారుతి ఇప్పుడు గోపీచంద్ తో చేస్తోన్న పక్కా కమర్షియల్ సినిమాకు సంబంధించిన అన్ని పనులూ పూర్తి చేసి విడుదల కూడా చేసే అవకాశం ఉంటుంది.
ఏదేమైనా ప్రభాస్ తో హారర్ కామెడీ అంటే.. అది కూడా మారుతి దర్శకత్వంలో అంటే.. ఖచ్చితంగా ప్రేమకథాచిత్రమ్ గుర్తుకు రాక మానదు. దాన్ని మరిపిస్తేనే మారుతి మళ్లీ ప్రూవ్ చేసుకున్నవాడవుతాడు. లేదంటే మళ్లీమళ్లీ అవే కథలు వర్కవుట్ కావు. కథలేనప్పుడు ఎంత పెద్ద స్టార్ అయినా.. సినిమాను కాపాడలేడు అనేది అందరికీ తెలిసిన సత్యం.

, , , , , , , , ,