ad

పెద్ద అందగత్తె కాదు. కానీ ఉన్న అందాలను వెండితెరపై విస్తారంగా పంచే తెగువ ఉంది. అందుకే ముకుంద, ఒక లైలాకోసం సినిమాలు పోయిన తర్వాత ఇక తనను ఎవరూ పట్టించుకోరు అనుకుంటోన్న టైమ్ లో దువ్వాడ జగన్నాథానికి బికినీ ట్రీట్ చేసి బాప్ రే అనిపించింది. కట్ చేస్తే ఆ బికినీయే అమ్మడికి తెలుగులో వరుస అవకాశాలు తెచ్చింది. మామూలుగా సౌత్ ఫేమ్ తో బాలీవుడ్ లో పాగా వేయాలనుకుంటారు చాలామంది హీరోలు. పైగా వీళ్లు వచ్చేదే అక్కడి నుంచి. కానీ అక్కడెవరూ పట్టించుకోరు కదా.. అందుకే ఈ ఫేమ్ ను అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. పూజా కూడా అలాగే చేసింది. అక్కడ మొహెంజోదారో అనే సినిమాతో టాప్ స్టార్ అయిన హృతిక్ రోషన్ సరసన ఛాన్స్ కొట్టేసి బాలీవుడ్ లో వెలిగిపోవాలనుకుంది పాపం. బట్.. ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. సినిమా పోతే పోయింది.. కనీసం పూజాకు మినిమం గుర్తింపు కూడా రాలేదు. దీంతో మళ్లీ తెలుగు సినిమాకే వచ్చిందీ జిగేల్ రాణి.

తెలుగులో తన లక్కేంటో కానీ.. చేసిందల్లా హిట్టే అన్నట్టుగా మారింది. చాలా షార్ట్ టైమ్ లోనే టాప్ హీరోయిన్ అయిపోయింది. మరోవైపు సమంత వంటి బ్యూటీస్ పెళ్లి చేసుకోవడం కూడా ఈ డస్కీసోయగానికి కలిసొచ్చింది. నటన యావరేజ్ అయినా స్కిన్ షోతో ఆకట్టుకుని అటుపై యాక్టింగ్ లోనూ పట్టు పెంచుకుని త్రివిక్రమ్ శ్రీనివాస్ క్యాంప్ లో చేరి ఏకంగా తెలుగూ నేర్చుకుని టాప్ హీరోయిన్ కు కావాల్సిన అన్ని క్వాలిటీస్ ను సంపాదించుకుంది. ఇప్పుడు కేవలం ఫేమ్ మాత్రమే కాదు.. టాప్ హీరోయిన్ అన్న ట్యాగ్ కూడా ఉంది కదా.. అందుకే ఆ ట్యాగ్ పట్టుకుని మళ్లీ బాలీవుడ్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ అవేవీ వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు.

ఇక రీసెంట్ గా కోలీవుడ్ లో లక్ చెక్ చేసుకోవాలనుకుంది. ఇక్కడెలాగూ టాప్ హీరోయిన్నే కాబట్టి.. భారీ చెక్ లు కూడా డిమాండ్ చేసి కోలీవుడ్ లో లెగ్గు పెట్టింది. బీస్ట్ గా వచ్చిన ఈ సినిమాలో అమ్మడి పాత్ర కరివేపాకులా ఉండటంతో పాత్ర సెలెక్షన్ లో అమ్మడి టేస్ట్ పై అక్కడా విమర్శలు వచ్చాయి. కట్ చేస్తే.. తక్కువ సీన్స్ కు ఎక్కువ రెమ్యూనరేషన్ వచ్చింది అనే శాటిస్ ఫ్యాక్షన్ తప్ప.. బీస్ట్ వల్ల పూజాకు వచ్చిన బెస్ట్ ఏం లేదు. కోలీవుడ్ ఆశలు కూడా గల్లంతు కావడంతో ఇక తెలుగుపైనే సీరియస్ గా కాన్ సెంట్రేట్ చేయాలనుకుంటోందట. అఫ్ కోర్స్ ఇక్కడ తనకు భారీ డిమాండే ఉంది కాబట్టి.. కాన్ సెంట్రేషన్ కూడా భారీగా పెట్టక్కర్లేదు.

ఏదేమైనా తెలుగును దాటి తన గ్లామర్ ను దేశం మొత్తం చూపించాలనుకుంటోన్న పూజాహెగ్డే ఆశలు మాత్రం నెరవేరడం లేదు పాపం. మరి ఆల్రెడీ ఒప్పుకున్న హిందీ సినిమాలైనా ఈ ముద్దుగుమ్మను తెలుగు దాటిస్తాయా లేదా అనేది చూడాలి.

, ,