ad

టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా తిరుగులేకుండా దూసుకుపోతోంది అని ఇప్పటి వరకూ అనుకున్నాం. కానీ తిరుగు ఉంది. తనకూ ఫ్లాపులు మొదలయ్యాయి. అది కూడా వరుసగా. యస్.. పైగా కనిపించడం లేదు కానీ.. పూజాహెగ్డే ఖాతాలో ఇప్పుడు హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. వీటిలో రెండు ఫ్లాపులు తనపైన పూర్తిగా వేయలేం. కానీ ఫ్లాప్ పిక్చర్స్ లో ఉంది కాబట్టి భాగం ఇవ్వాల్సిందే కదా.. ఇంతకీ ఆ మూడు చిత్రాలేంటీ అనుకుంటున్నారేమో.. ?


భారీ అంచనాల మధ్య వచ్చిన రాధేశ్యామ్ తో మొదటి ఫ్లాప్ చూసింది. ఈ సినిమాలో తన పాత్ర చాలా కీలకం. ఇంకా చెబితే ప్రభాస్ అండ్ పూజా తప్ప సినిమాలో ఇంకేం కనిపించనంత. అంతటి ప్రాధాన్యం ఉన్న పాత్రలో తను ఆకట్టుకున్నా.. సినిమా పోయింది. పూజా నటనకు మార్కులు పడ్డాయి కానీ.. నిర్మాతకు మనీ రాలేదు.
ఇక రీసెంట్ గా తమిళ్ ఎంట్రీ అంటూ గ్రాండ్ గా చెప్పుకున్న బీస్ట్ సైతం డిజాస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్ గా నిర్మాతల ముక్కు పిండి మరీ వసూలు చేసే తను తమిళ్ లో కరివేపాకు లాంటి పాత్రకు కూడా ఒప్పుకుంది. కారణమేంటో తెలుసా.. ఆ కరివేపాకు పాత్రకూ కాసులు భారీగా ఇచ్చారట. ఒక పాట.. అంతకు ముందు చేసిన టైట్ ఎక్స్ పోజింగ్ కోసమే అంత ముట్టచెప్పారు అనుకోవచ్చు. లేదా తెలుగులో తన వల్ల మార్కెట్ యాడ్ అవుతుందనుకునీ ఉండొచ్చు.


ఇక లేటెస్ట్ గా వచ్చిన ఆచార్యతో అమ్మడి ఖాతాలో హ్యాట్రిక్ పడింది. నిజానికి ఈ సినిమా కథ(ఉందా అంటే ఏం చెప్పలేం)కు, లేదా కథలో ఏ మాత్రం ప్రాధాన్యం లేని పాత్ర. ఏదో ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నపాత్రలా నటించింది తను. అస్సలే మాత్రం ప్రభావం లేదీ పాత్రలో.. తన నటనలో. సినిమాలాగానే పూజా పాత్రను కూడా చివరికి వదిలేశాడు దర్శకుడు కొరటాల శివ. మరి ఇలాంటి పాత్రలు, సినిమాలతో టాప్ హీరోయిన్ అన్న ట్యాగ్ ను క్యారీ చేయడం అంత సులువేం కాదు. మరో ఒకటీ రెండు ఫ్లాపులు పడ్డాయంటే పాపను పక్కన బెట్టేసి కొత్త సరుకును దించేస్తుంది టాలీవుడ్.

, , , , , , , , , ,