పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఫోన్‌ హ్యాక్‌…
Inside Media Politics

పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఫోన్‌ హ్యాక్‌…

పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఫోన్‌ లని ఇండియా హ్యాక్‌ చేసిందా..?? పాకిస్తాన్‌ కు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయా..?? పాకిస్తాన్‌ ఎలాంటి కుట్రలు చేస్తోంది..?? ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌.. ఇండియాకి వ్యతిరేకంగా ఎలాంటి కుట్రలు పన్నుతున్నారు..?? అక్కడి ప్రతిపక్షాలు, ఆ దేశంలోని సమస్యలను సైతం భారత్‌ తెలుసుకుంటోందట.. ఈ ఆరోపణలు చేసింది ఎవరో కాదు.. పాకిస్తాన్‌.

అవును, ఇమ్రాన్‌ సర్కార్‌… తన పని అయిపోయిందనుకుందో, దేశంలో సమస్యలను పక్కదారి పట్టించాలని భావించిందో తెలియదు కానీ, భారత్‌ ని మరోసారి బూచిగా చూపాలని ప్లాన్‌ చేస్తోంది.. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఫోన్‌ ని ఇండియా హ్యాక్‌ చేసిందని సంచలన ఆరోపణలు చేసింది.. దేశంలో ప్రతిపక్షాల ఫోన్‌ లు, ఇతర సీఎమ్‌లు, ఉన్నతాధికారులు, ఎంపీల ఫోన్‌ లను పెగాసిస్‌ అనే సాఫ్ట్‌ వేర్‌ తో హ్యాక్‌ చేస్తున్నారని విపక్షాలు పార్లమెంట్‌ లో నిలదీశాయి… ఓ పత్రిక దేశంలోని ప్రముఖుల ఫోన్‌ నెంబర్‌ ల హ్యాకింగ్‌ పై సంచలన కథనాలు వెలువరించింది.. ఇజ్రాయేల్‌ కి చెందిన ఓ సాఫ్ట్‌ వేర్‌ తో ఫోన్‌ లు హ్యాక్‌ చేస్తోందని, ఎవరెవరి ఫోన్‌ లు, ఏయే సమయాలలో హ్యాక్‌ చేసిందో మొత్తం ఆధారాలతో కథనం వెలువరించింది.. దీంతో, దేశంలో కొత్త రగడకు తెరలేచింది..

ఇదే సమయంలో తగుదునమ్మా అంటూ పాకిస్తాన్‌ సైతం ఈ రగడను క్యాష్‌ చేసుకోవడానికి ప్లాన్‌ చేసింది.. భారత్‌ తమ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఫోన్‌ లను ట్యాప్‌ చేస్తోందని సంచలన ఆరోపణలు చేసింది.. ఇదే ఇప్పుడు పాకిస్తాన్‌ డొల్లతనాన్ని బయటపెడుతోంది..

తమ దేశ ప్రధాని ఫోన్‌ హ్యాక్‌ అవుతోన్న సంగతి, పక్క దేశంలోని పత్రిక బయటపెట్టేదాకా తెలియదంటే హాస్యాస్పదం అవుతోంది.. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అని కామెంట్‌ చేస్తున్నారు.. పాకిస్తాన్‌ అప్పుల కుప్పలా తయారయింది.. కరోనాతో ఆ దేశంలో అభివృద్ధి పడకేసింది.. ఇటు, ఇమ్రాన్‌ సర్కార్‌ కి దిన దిన గండం నూరేళ్ల ఆయుష్సుగా మారింది పరిస్థితి.. దీంతో, ఈ పరిస్థితిని క్యాష్‌ చేసుకునేందుకు ఇండియాలో ప్రకంపనలు రేపుతోన్న ఫోన్‌ హ్యాక్‌ వివాదాన్ని తలకు ఎక్కించుకుంది.. ఇండియాపై ఆరోపణలకు దిగుతోంది..

పొరుగుదేశం తమ దేశ ప్రధాని ఫోన్‌ ట్యాప్‌ చేస్తే పరువు పోతుందనే సిగ్గు కూడా లేదు.. పాకిస్తాన్‌ చేస్తోన్న తాజా ఆరోపణలతో ప్రపంచ దేశాలు సైతం నవ్వుకుంటున్నాయి.. పాక్‌ పరువుపోతోంది.. ఇతర దేశాలు కూడా జోకులు పేల్చుకుంటున్నాయి.. అయినా ఇమ్రాన్‌ ఖాన్‌ సర్కార్‌ ఇవేవీ పట్టించుకోవడం లేదు.. పాకిస్తాన్‌ అమాయక ప్రజలు నమ్మితే చాలు అని భావిస్తోంది.. మరి, పాక్‌ ఓటర్లు ఇమ్రాన్‌ ఖాన్‌ కి ఎలా బుద్ధి చెబుతారో చూడాలి.. ఆ సంగతి పక్కన పెడితే.. అంతర్జాతీయంగా పాక్‌ పరువు పోయిందనే చర్చ నడుస్తోంది..

Post Comment