48 వేల కోట్లతో చైనాకి చెక్‌ భారత్‌ ప్లాన్‌ కి జిన్‌ పింగ్‌ మైండ్‌ బ్లాంక్‌…..
News Channels Politics

48 వేల కోట్లతో చైనాకి చెక్‌ భారత్‌ ప్లాన్‌ కి జిన్‌ పింగ్‌ మైండ్‌ బ్లాంక్‌…..

భారత్‌ గేర్‌ మార్చింది.. ఇక దూకుడు పెంచాలని నిర్ణయించుకుంది.. డ్రాగన్‌ కంట్రీ చైనాని నిలువరించాలంటే… తన సైన్య బలగాలను, ఆయుధ సంపత్తిని మరింత పెంచుకోవాలని నిర్ణయించుకుంది.. నిన్నమొన్నటిదాకా కేవలం కాగితాలకే పరిమితమయిన ప్రపోజల్స్‌ ని తాజాగా ఆచరణలో పెట్టడానికి సిద్ధం అయింది..

గాల్వన్‌ లోయలో జరిగిన ఘర్షణలో చైనాకి దారుణ పరాభవం ఎదురయింది.. భారత్‌ కి చెందిన సైనికులు 20 మంది వీరమరణం పొందగా, చైనాకి చెందిన జవాన్లు ఏకంగా 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇటు అంతకుమించిన డ్రాగన్‌ జవాన్లకు గాయాలయ్యాయని అంతర్జాతీయ పత్రికలు కథనాలు ప్రచురించాయి..

ప్రత్యక్ష యుద్ధంలో చైనాని మట్టి కరిపించే సత్తా ఉందని నిరూపించింది ఇండియా.. దీంతోపాటు తన వాయుసేనని సైతం మరింత పటిష్టం చేసుకుంది.. ప్రపంచంలోనే అత్యంత ఆధునిక యుద్ధ విమానాలు రఫేల్‌ని దిగుమతి చేసుకుంది భారత్‌.. దీంతో, చైనా యుద్ద విమానాలను సైతం ఢీ కొట్టగల సత్తా ఇండియాకి చేరిపోయింది..

చైనాతో పోల్చితే భారత్‌ వాయుసేన సైతం పటిష్టంగానే ఉంది.. ఒక్క నౌకా దళంలోనే ఇండియా వెనుకబడి ఉంది.. చైనా దగ్గర ముప్పైకి పైగా సబ్‌ మెరైన్లు ఉంటే.. ఇండియాకి ఆ సంఖ్య సింగిల్‌ డిజిట్‌ కే పరిమితం.. అందుకే, ఇకపై సబ్‌ మెరైన్‌ లను మరింతగా పెంచుకోవాలిన భావించిన ఇండియా.. ఏకంగా యాభై వేల కోట్ల రూపాయలను కేటాయించడానికి రెడీ అయింది..

సుమారు పదికిపైగా యుద్ద విమానాలను రాబోయే నాలుగయిదు సంవత్సరాలలో సమకూర్చుకోవడానికి సన్నద్దం అవుతోంది.. వీటిని దిగుమతి చేసుకోవడం లేదు.. భారత్‌ లో స్వయంగా నిర్మించడానికి అనుమతులు జారీ చేసింది.. నౌకా నిర్మాణంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన భారత కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన మాజ్‌ గావ్‌ డాక్‌ సంస్థతోపాటు మరో సంస్థకు ఈ బాధ్యత అప్పజెప్పింది ఇండియా..

ఏకకాలంలో ఎనిమిది నుండి పది యుద్ధ నౌకలను తయారు చేయడానికి రెడీ అవుతున్నాయి ఈ సంస్థలు.. డ్రాగన్‌ ని నిలువరించాలంటే… చైనా సముద్రం నుండి సైతం ఎటాక్‌ చేయాలి.. ఇటు లడఖ్‌ బోర్డర్‌ లో భారత్‌ అత్యంత పటిష్టంగా ఉంది.. అయితే, యుద్ద నౌకలు, సబ్‌ మెరైన్‌ ల అంశంలోనే బారత్‌ కాస్త వెనుకంజలో ఉంది.. ఆ లోటును భర్తీ చేసుకోవడానికి ఇండియా వేసిన ప్రణాళికతో చైనా ఉలిక్కి పడింది.. రాబోయే నాలుగయిదు సంవత్సరాల కాలంలోనే డ్రాగన్‌ ని సముద్రంలోనై ఢీ కొట్టగల సత్తా దక్కించుకోనుంది భారత్‌.. మరి, ఈ ఎత్తుకు చైనా ఎలా సిద్దం అవుతుందో చూడాలి..

Post Comment