నన్ను హత్య  చేసేందుకు కుట్ర…! ఆ మంత్రి పై ఈటల సంచలన ఆరోపణలు .
Politics

నన్ను హత్య చేసేందుకు కుట్ర…! ఆ మంత్రి పై ఈటల సంచలన ఆరోపణలు .

మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు.. అధికార టీఆర్ఎస్ పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తనను చంపడానికి జిల్లాకు చెందిన ఒక మంత్రి కుట్ర చేస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హత్య కోసం హంతక ముఠాతో చేతులు కలిపాడని అన్నారు. ఈ కుట్రకు సంబంధించి త్వరలోనే ఫోటోలతో సహా ఆధారాలు బయటపెడతానని, తన దగ్గర పక్కా సమాచారం ఉందని ఆరోపించారు..

అరేయ్ కొడకల్లారా…. చంపుతానని నయీం బెదిరించినప్పుడే భయపడలేదు. ఈ చిల్లర ప్రయత్నాలకు కూడా భయపడనని వ్యాఖ్యానించారు. ఉగ్గుపాలతోనే ఉద్యమాలు చేసిన చరిత్ర తనదని, ఆత్మ గౌరవం కోసం ఏ స్థాయిలో అయినా కొట్లాడతామని చెప్పారు.

ఈటల వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ ఉలిక్కిపడింది.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్‌ ఈటల వ్యాఖ్యలపై మండిపడ్డారు.. తెలంగాణలో హత్యా రాజకీయాలు ఉండవని, ఈటల తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఆధారాలు బయట పెట‌్టాలని నిలదీశారు.. ఈటల ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు కాబట్టి సీబీఐ, ఎన్ఐఏలతో విచారణ జరిపించుకోవచ్చని సెటైర్ వేశారు. ఈటలను చంపాల్సిన అవసరం, హత్యా రాజకీయాలు చేయాల్సిన అగత్యం ఎవరికీ లేవని కామెంట్‌ చేశారు..

గంగుల వ్యాఖ్యలకు ఈటల కౌంటర్‌ ఇచ్చారు.. తనను హత్య చేసేందుకు ఒక మంత్రి కుట్ర పన్నారనే ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నానని ఈటల చెప్పారు. దీనికి సంబంధించిన ఫొటోలను త్వరలోనే విడుదల చేస్తానని తెలిపారు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ ఇలాంటి చిల్లర పనులకు పాల్పడుతోందని అన్నారు.

ఈటల వ్యాఖ్యలు ఇప్పటికే ప్రకంపనలు రేపుతున్నాయి.. రాజకీయ కేక పుట్టిస్తున్నాయి.. తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఈటల కామెంట్‌ చేయడంతో తెలంగాణలో దుమారం రేగుతోంది.. ఈటల వ్యాఖ్యలు టీఆర్‌ఎస్‌ లో కలవరం పుట్టిస్తున్నాయని చెబుతున్నారు విశ్లేషకులు.. అందుకే, ఈటల కామెంట్స్‌ పై వెంటనే వివరణ ఇచ్చింది గులాబీ దండు.. మరి, ఈ తాజా పరిణామం ఎలాంటి రాజకీయ టర్న్‌ తీసుకుంటుందో చూడాలి.. హుజూరాబాద్‌ గడ్డ సాక్షిగా ఏ క్షణంలో ఎలాంటి ట్విస్ట్‌ చోటు చేసుకుంటుందో అనేది ఆసక్తికరంగా మారింది..

Post Comment