ఎన్టీఆర్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తారా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం కొరటాల శివ తీసుకున్న టైటిల్ విషయంలో పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ డిఫరెంట్ గా స్పందిస్తున్నారు. వారి స్పందనలో నిజాయితీ లేదు అనేది నిజం. అయినా దర్శకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కారణమేంటో తెలుసు కదా..? కొరటాల – ఎన్టీఆర్ కాంబోలో వస్తోన్న సినిమాకు “దేవర” అనే టైటిల్ ఫిక్స్ చేశాడు. అయితే ఈ దేవర అనే టైటిల్ పవన్ కళ్యాణ్‌ కు మాత్రమే వాడాలనేది వారి వాదన. ఈ మాటను పవన్ కోసం బండ్ల గణేష్‌ వాడుతుంటాడు కదా. అందుకే ఆ పదం ఆయనకే సొంతం అనేది వారి వెర్షన్. ఇందులో ఏ మాత్రం పస లేదు అనేది నిజం. ఎవరో ఒక వ్యక్తి తన అభిమాన నటుడుని ఫలానా అని పిలుచుకుంటే ఆ పదం అయినదైపోతుందా..? అదే గణేష్ పవన్ ను పరమేశ్వరా అన్నాడు.

అంటే పరమేశ్వరుడు తన పేరు మార్చుకోవాల్సిందే అన్నట్టుగా ఉంది కదా పరిస్థితి. మొత్తంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం కొరటాల శివ టార్గెట్ గా సోషల్ మీడియాలో కామెంట్స్ మొదలుపెట్టారు.
నిజానికి ఏ దర్శకుడైనా తన కథకు సూట్ అయ్యే టైటిల్స్ ను పెట్టుకుంటాడు. ఈ విషయంలో కొరటాలను అనేందుకు ఏముందీ అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా కౌంటర్స్ మొదలుపెట్టారు.


ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌ సినిమాల విషయంలో పెద్దగా ఇంట్రెస్టింగ్ గా లేడు. ఒప్పుకున్న సినిమాలకే దిక్కులేదు. మరోవైపు ఈ టైటిల్ ను బండ్ల గణేష్ రిజిస్టర్ చేశాడా లేదా అనేది చెప్పడం లేదు. ఒకవేళ రిజిస్టర్ చేస్తే కొరటాల తీసుకోలేడు. తీసుకున్నా ఆ ఇద్దరి మధ్య ఒక అండర్ స్టాండింగ్ ఉంటుంది కదా..? ఒకవేళ కొరటాల శివే రిజిస్టర్ చేసుకుంటే ఇంక వేరేవారు అనడానికి ఏముంటుందీ.. సో.. దేవర అనే టైటిల్ ను ఎవరి పర్మిషన్ లేకుండానే ఎన్టీఆర్ కోసం పెట్టేయొచ్చు. ఇందులో ఎవరి అభ్యంతరాలూ, ఆక్షేపణలూ పట్టించుకోవాల్సిన పనిలేదు అని ఎవరిని అడిగినా చెబుతారు. సో.. పవన్ ఫ్యాన్స్ ఆవేశంలో అర్థం లేదనే చెప్పాలి.

, , , , , , , ,