కొన్ని రూమర్స్ భలే హల్చల్ చేస్తాయి. ఆ న్యూస్ లో స్టార్ హీరోలు కూడా ఉంటే ఇంక చెప్పేదేముందీ.. క్షణాల్లోనే వైరల్ అవుతాయి. లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్‌ కొత్త సినిమాకు సంబంధించి కూడా ఇలాంటి వార్తలే వచ్చాయి. కానీ గంటల్లోనే అదినిజం కాదని స్వయంగా ప్రొడక్షన్ హౌసే ప్రకటించాల్సి వచ్చిందంటే.. ఆ న్యూస్ ఎంత వేగంగా వెళ్లిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ వార్త ఏంటంటే.. పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం చేస్తోన్న సినిమాలన్నీ పక్కన బెట్టేసి.. రన్ రాజా రన్, సాహో ఫేమ్ సుజిత్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడని. ఇది వినడానికే ఆశ్చర్యంగా ఉంది. కానీ ఇప్పుడు పవన్ చేస్తోన్న సినిమాల లిస్ట్ చూస్తే నిజమే అనిపించక తప్పని పరిస్థితి. ఎందుకంటే ముందు ఒప్పుకున్నవి కాదని తర్వాత ఓకే చేసిన చిత్రాలను పూర్తి చేసి ఏకంగా విడుదల కూడా చేశాడు కాబట్టి..

పవన్ ఇలా చేసినా ఆశ్చర్యం లేదు అనుకున్నారు అంతా. పైగా ఈ చిత్రానికి ఆర్ఆర్ఆర్ తో మంచి ఫామ్ లోకి వచ్చిన నిర్మాత డివివి దానయ్య అనేశారు. అంతేనా.. త్రివిక్రమ్ – పవన్ సహ నిర్మాతలు కూడా అని ఓ వార్త వండేశారు. ఇక సినిమాను యాక్షన్ ఎంటర్టైనర్ గా తేల్చారు. ఇంక చప్పేదేముందీ.. ఈ న్యూస్ బయటకు వచ్చిన దగ్గర్నుంచీ ఇప్పటికే సినిమాలు చేస్తోన్న ప్రొడ్యూసర్స్ లో ఓ ఆక్రోశం.. దర్శకుల్లో బాధ.. ఒకేసారి కనిపించింది. కానీ వారి బాధకు డివివి దానయ్య కాస్త త్వరగానే ఫుల్ స్టాప్ పెట్టేశాడు పాపం.డివివి దానయ్య బ్యానర్ లో పవన్ కళ్యాణ్‌ – సుజిత్ సినిమా అనే వార్తను డైరెక్ట్ గా ఉటంకించకుండా.. మా బ్యానర్ లో వచ్చే సినిమాలకు సంబంధించిన వార్తలను మేమే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తాము. అప్పటి వరకూ ఎలాంటి రూమర్స్ ను నమ్మవద్దు అని ఇన్ డైరెక్ట్ గా మేం ఈ ప్రాజెక్ట్ చేయడం లేదు అని తేల్చేశాడు. ఏదేమైనా వార్తలకంటే వార్తల్లాంటివే ఎక్కువ వైరల్ అవుతాయనేందుకు ఈ న్యూస్ మరో ఎగ్జాంపుల్.

అద్సరే కానీ.. అసలు సాహో లాంటి డిజాస్టర్ ఇచ్చిన సుజిత్ కు పవన్ మళ్లీ ఎలా ఛాన్స్ ఇస్తాడు అనుకున్నారో అనుకుంటున్నారేమో.. నిజానికి ఇది ఓ రీమేక్. తమిళ్ లో విజయ్ హీరోగా నటించిన హిట్ మూవీ తెరికి తెలుగు రీమేక్. బట్ ఈ తెరి తెలుగులోనూ పోలీసోడుగా డబ్ అయింది. అయినా పవన్ చేయాలనుకున్నాడు కాబట్టి సుజిత్ ను తీసుకున్నారు. అయితే సుజిత్ తెరి రీమేక్ కోసం మార్పులు చేయకుండా తన సొంత కథ చెప్పాడట. అది నచ్చే ఈ ప్రాజెక్ట్ ఓకే అయిందన్నారు. అక్కడ చాలామంది పడిపోయారు. కట్ చేస్తే వీరి కాంబినేషన్ లో సినిమా ఉంటే ఉండొచ్చు కానీ.. ఇప్పటికైతే దానికి నిర్మాత దానయ్య కాదు.

, , , , ,